హీరో అజిత్ డిశ్చార్జ్... సర్జరీ చేసి పల్జ్  తొలగింపు, అసలు సమస్య ఏంటంటే?

Published : Mar 09, 2024, 12:19 PM IST
హీరో అజిత్ డిశ్చార్జ్... సర్జరీ చేసి పల్జ్  తొలగింపు, అసలు సమస్య ఏంటంటే?

సారాంశం

హీరో అజిత్ చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ కాగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ ట్యూమర్ అని ప్రచారం జరిగింది. అయితే అజిత్ డిశ్చార్జ్ కాగా సమస్య ఏమిటో వెలుగులోకి వచ్చింది.   

హీరో అజిత్ కుమార్ ఆరోగ్యం పై అనేక పుకార్లు చక్కర్లు కొట్టాయి. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అజిత్ కుమార్ అడ్మిట్ అయ్యాడు. దీనికి సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చాయి. అజిత్ కి ఏమైందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. అజిత్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాటి పళని స్వామి ఎక్స్ లో ట్వీట్ చేయడం మరింత ఆందోళనకు గురి చేసింది. 

కాగా అజిత్ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నాడు. ఆయనకు సర్జరీ జరిగిందని కథనాలు వెలువడ్డాయి. అయితే అజిత్ కి ఎలాంటి సమస్య లేదని సమాచారం అందుతుంది.  అజిత్ చెవి కింది భాగంలో చిన్న బుడిపె వచ్చిందట. దీన్ని వైద్య పరిభాషలో పల్ఙ్ అంటారట. దాని వలన ఎలాంటి ప్రమాదం లేదట. అయినప్పటికీ సర్జరీ చేసి దాన్ని తొలగించారట. అజిత్ శుక్రవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారట. 

తాజా సమాచారం అజిత్ ఫ్యాన్స్ లో ఆనందం నింపింది. ప్రస్తుతం అజిత్ విడా మయార్చి టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. బాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ సర్జా ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. 

అజిత్ గత చిత్రాలు వలిమై, తునివు మంచి విజయాలు సాధించాయి. కోలీవుడ్ లో అజిత్ స్టార్ హీరోల్లో ఒకరు. కారు రేసులు, బైక్ రేసుల్లో పాల్గొంటూ రియల్ హీరోగా అజిత్ పేరు తెచ్చుకున్నాడు. అజిత్ కి తెలుగులో కూడా మార్కెట్ ఉంది. కెరీర్ బిగినింగ్ లో అజిత్ చేసిన లవ్ ఎంటర్టైనర్స్  ఆదరణ పొందాయి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?