Yash 19 : యష్ కు జోడీగా సాయిపల్లవి? లేడీ పవర్ స్టార్ కు బంపర్ ఆఫర్!

Published : Dec 06, 2023, 08:36 AM IST
Yash 19 : యష్ కు జోడీగా సాయిపల్లవి? లేడీ పవర్ స్టార్ కు బంపర్ ఆఫర్!

సారాంశం

లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా మరో బంపర్ ఆఫర్ దక్కించుకుంటున్న టాక్ వినిపిస్తోంది. యష్ కు జోడీగా నటించబోతుందని తెలుస్తోంది. 

నేచురల్ బ్యూటీ, లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి (Sai Pallavi) టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళం నుంచి హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్నఈ ముద్దుగుమ్మ తెలుగులో బ్లాక్ బాస్టర్ సినిమాలు చేసింది. ‘ఫిదా’, ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, ‘పడి పడి లేచే మనసు’, ‘లవ్ స్టోరీ‘, ‘శ్యామ్ సింగరాయ్’, ‘విరాటపర్వం’ వంటి  చిత్రాలతో అలరించింది. గ్లామర్ పాత్రలకే కాకుండా నటనకు ప్రాధాన్యమున్న విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆయా చిత్రాలో బిజీగా ఉంది. తాజాగా అభిమానులు ఖుషీ అయ్యే ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. సాయిపల్లవికి భారీ ఫిల్మ్ నుంచి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. కన్నడ సూపర్ స్టార్ యష్ (Yash) చివరిగా ‘కేజీఎఫ్2’ (KGF2)తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. ఈ బ్లాక్ బాస్టర్ తర్వాత ఏడాదిన్నర తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మొన్ననే అనౌన్స్ మెంట్ అందించారు. Yash19కి సమయం వచ్చిందని.. డిసెంబర్ 8న టైటిల్ ను రివీల్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. 

ఈ క్రమంలో యష్ కు జోడీగా ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సాయిపల్లవి పేరు మాత్రం గట్టిగానే వినిపిస్తోంది. వీరి ఇద్దరి పేయిర్ ఫైనల్ అయ్యందా? లేదా? అన్నది రెండ్రోజుల్లో తెలియనుంది. మరోవైపు దర్శకులు ఎవరనేది కూడా సస్పెన్స్ లోనే ఉంది. ఇదీ ఆరోజే తెలుస్తుంది. ఇక అభిమానులు టైటిల్ పోస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. 

ఇక సాయి పల్లవి మాత్రం తమిళంలో శివకార్తీకేయ 21వ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) సరసన ‘తండేల్’ చిత్రంలో నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కార్తీకేయ2’ దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌