Aamir Khan : ‘యానిమల్’ సక్సెస్.. వాయిలెన్స్, బోల్డ్ సీన్లపై అమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్.! వీడియో

Published : Dec 06, 2023, 07:01 AM ISTUpdated : Dec 06, 2023, 07:05 AM IST
Aamir Khan  : ‘యానిమల్’ సక్సెస్.. వాయిలెన్స్, బోల్డ్ సీన్లపై అమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్.! వీడియో

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో ‘యానిమల్’ నార్త్ లో పాజిటివ్ టాక్ తో పాటు కొంత మిశ్రమ స్పందనను పొందుతోంది. వాయిలెన్స్ పై విమర్శలూ వస్తున్నాయి. ఈ క్రమంలో అమీర్ ఖాన్ స్టేట్ మెంట్ వైరల్ గా మారింది. 

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) 'యానిమల్' (Animal The Film)  థియేటర్లలోకి వచ్చి రేపటి వారం పూర్తి కానుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలతో పాజిటివ్ టాక్ ఎలా దక్కిందో.. మరోవైపు మిశ్రమ స్పందన కూడా వస్తోంది.దీనికి కారణంగా సినిమాలోని టాక్సిక్ వాయిలెన్స్, బోల్డ్ సీన్లు వంటి వాటిని చెబుతున్నారు. ఈక్రమంలో విమర్శలూ ఎదుర్కొంటున్నారు యానిమల్ టీమ్. 

ఈ సందర్భంగా బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan)   వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆయన గతంలో వాయిలెన్స్, సెక్స్ పై చేసిన కొన్ని కామెంట్లకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అమీర్ మాట్లాడుతూ...  'వాయిలెన్స్, s** వంటి కొన్ని భావోద్వేగాలతో ప్రేక్షకులను రెచ్చగొట్టడం చాలా సులభం. ఈ భావోద్వేగాలు మనిషిలో తేలికగా రెచ్చిపోతాయి. అయితే కథను రూపొందించడంలో, భావోద్వేగాలను చూపించడంలో, పరిస్థితులను సృష్టించడంలో దర్శకులు ప్రతిభావంతులు కాకపోతేనే.. హింస, బోల్డ్ కంటెంట్ పై ఎక్కువగా ఆధారపడతారు' అని చెప్పుకొచ్చారు. ఈ వీడియో ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు. 

అలాగే.. అలా సినిమా చేయడం ద్వారా విజయవంతమవుతుందని కానీ సమాజానికి హాని కలిగించవచ్చని పేర్కొన్నారు. చూసే ప్రేక్షకులు, యువతపై ప్రభావం ఉంటుంది. సినిమాల్లో హింస ఉండకూడదు అని నేను అనడం లేదు. ఇది సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉండాలి. చూపించే మార్గాలు కూడా ఉన్నాయన్నారు.  ‘యానిమల్’ రిలీజ్ తర్వాత అమీర్ ఖాన్ మాటలు పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతున్నాయి. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్‘ వంటి సంచలనాత్మక సినిమాలు తెరకెక్కించిన రాజమౌళి సందీప్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. యంగ్ జనరేషన్ ఆర్జీవీ అంటూ అభినందించారు.

ఇక సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ‘యానిమల్’కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే దక్కుతోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.350 కోట్లకు పైగా వసూళ్లు చేయడమంటే మాములూ విషయం కాదు. కమర్షియల్ గా మంచి సక్సెస్ ను చూస్తోంది. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna), అనిల్ కపూర్, బాబీ డియోల్, బబ్లూ పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌