గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందంతే... ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సాయి పల్లవి

Published : May 09, 2022, 05:59 PM IST
గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందంతే... ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సాయి పల్లవి

సారాంశం

ఈ మధ్య కనిపించడం మానేసింది సాయి పల్లవి. శ్యామ్ సింగ్ రాయ్ తరువాత ఆమె ఎక్కడా యాక్టీవ్ గా కనిపించలేదు. ఇక కాస్త గ్యాప్ తరువాత ఇప్పుడు హడావిడి చేయబోతోంది బ్యూటీ. బర్త్ డే సందర్భంగా సాయి పల్లవి నుంచి వరుస అప్ డేట్స్ బయటకు వస్తున్నాయి. 

ఈ మధ్య కనిపించడం మానేసింది సాయి పల్లవి. శ్యామ్ సింగ్ రాయ్ తరువాత ఆమె ఎక్కడా యాక్టీవ్ గా కనిపించలేదు. ఇక కాస్త గ్యాప్ తరువాత ఇప్పుడు హడావిడి చేయబోతోంది బ్యూటీ. బర్త్ డే సందర్భంగా సాయి పల్లవి నుంచి వరుస అప్ డేట్స్ బయటకు వస్తున్నాయి. 

తెలుగు, త‌మిళ భాష‌ల్లో సెలెక్టెడ్  సినిమాలు చేస్తూ.. తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సాయిప‌ల్ల‌వి. ఆరోజుతో 30 లోకి ఎంటర్ అయ్యింది సాయి. బర్త్ డే సందర్భంగా  త‌న ఫ్యాన్స్ కు , ఫాలోవ‌ర్లకు  అదిరిపోయే అప్ డేట్ అందించింది సాయి ప‌ల్ల‌వి. ఆల్ రెడీ  సాయి పల్లవి నటించిన విరాటపర్వం రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఇప్పుడు మరో సినిమా గురించి అనౌన్స్ చేసింది  నేచురల్ బ్యూటీ. 

సాయి పల్లవి నటిస్తోన్న కొత్త సినిమా గార్గి . రిచీ ఫేం గౌత‌మ్ రామ‌చంద్ర‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈసినిమాను  తెలుగు, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లోరిలీజ్ చేయబోతున్నారు. ఇక రీసెంట్ గా  ఈ 3- ఫ‌స్ట్ గ్లింప్స్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది సాయిప‌ల్ల‌వి. గార్గి సినిమా షూటింగ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేయ‌గా..ఇపుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. 

 

ఇక ఈసారి కూడా సినిమా పట్ల తన డెడికేషన్ చాటుకుంది సాయిప‌ల్ల‌వి. టాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో కూడా తన పాత్రకు తానే తెలుగు డబ్బింగ్ చెప్పుకున్న సాయి.. ఈసారి  క‌న్న‌డలో కూడా త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం విశేషం.  ఫీ మేల్ ఓరియెంటెడ్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను ర‌విచంద్ర‌న్ రామ‌చంద్ర‌న్‌, ఐశ్వ‌ర్యా ల‌క్ష్మి, థామ‌స్ జార్జ్‌, గౌత‌మ్ రామ‌చంద్ర‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈసినిమా గురించి సాయి పల్లవి ఈ విధంగా చెప్పింది. నేను ఈ సినిమా గురించి మాట్లాడటానికి నెలల నుంచి ఎదురుచూస్తున్నా. ఫైన‌ల్ గా టీం ప‌ట్టుబ‌ట్టి మరీ అప్‌డేట్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నప్పుడు..నా పుట్టినరోజు సంద‌ర్భంగా గార్గి వీడియో అందిస్తున్నానంటూ  ట్వీట్ చేసింది సాయిప‌ల్ల‌వి. ఇంగ్లీష్ టైటిల్‌తో కూడా పోస్ట‌ర్ విడుద‌ల చేసింది మూవీటీమ్.

96 మూవీ ఫేం గోవింద్ వ‌సంత ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.  తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక ఈ సినిమా నుంచి సాయి పల్లవి మళ్ళీ సూపర్ యాక్టీవ్ అవ్వాలంటున్నారు ఫ్యాన్స్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్