ఆకాశంలో తేలుతున్న సాయి పల్లవి..!

Published : Oct 12, 2022, 04:24 PM IST
ఆకాశంలో తేలుతున్న సాయి పల్లవి..!

సారాంశం

సాయి పల్లవి ఆకాశంలో తేలియాడుతుంది. ఆమె ఆనందానికి హద్దులు లేవు. దానికి కారణం ఆమెకు రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ దక్కడమే.   

2021లో సాయి పల్లవికి బాగా కలిసొచ్చింది. ఆ ఏడాది ఆమె రెండు హిట్ చిత్రాలు ఖాతాలో వేసుకున్నారు. విజయాలకు మించి ఆమె పాత్రలకు మంచి పేరొచ్చింది. లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో సాయి పల్లవి అద్భుతమైన రోల్స్ దక్కించుకుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల సాయి పల్లవి కోసం స్పెషల్ రోల్ డిజైన్ చేశాడు. ఫిదాతో సాయి పల్లవికి మంచి బ్రేక్ ఇచ్చిన ఆయన లవ్ స్టోరీ మూవీతో మరో సూపర్ హిట్ ఇచ్చారు. నాగ చైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. 

అలాగే రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వం వహించిన శ్యామ్ సింగరాయ్ హిట్ స్టేటస్ అందుకుంది. హీరో నాని రెండు భిన్నమైన పాత్రలు చేశారు. సాయి పల్లవి పీరియాడిక్ రోల్ చేశారు. ఆమె దేవదాసిగా కనిపించి ఆకట్టుకున్నారు. లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలలో నటనకు గాను సాయి పల్లవి ఫిల్మ్  ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఆమె రెండు అవార్డులు సొంతం చేసుకున్నారు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా సాయి పల్లవి షేర్ చేశారు. ఒకేసారి రెండు అవార్డ్స్ అందుకునే ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది. లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకోవడం ఆనందంగా ఉంది. దీనికి కారణమైన శేఖర్ కమ్ముల, రాహుల్ సంకీర్త్యన్ లకు, చిత్ర నిర్మాతలకు, యూనిట్ సభ్యులకు నా కృతఙ్ఞతలు.. అంటూ సాయి పల్లవి ఇంస్టాగ్రామ్ లో స్పందించారు. 

కాగా సాయి పల్లవి ఒక్క కొత్త చిత్రానికి కూడా సైన్ చేయలేదు. డిమాండ్ ఉన్నప్పటికీ ఆమె సైలెంట్ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాయి పల్లవి తెలుగులో చివరిగా విరాటపర్వం చిత్రంలో నటించారు. తమిళంలో తెరకెక్కిన గార్గి తెలుగులో విడుదలైనప్పటికీ ఆదరణ పొందలేదు. సాయి పల్లవి చిత్రాలు చేయకపోవడం ఫాన్స్ ని నిరాశపరుస్తుంది. ఆమె కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయాలని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. సాయి పల్లవి పుష్ప 2 లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక సమాచారం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి