భానుమతి పాత్రతో ఫేం వచ్చింది. పారితోషికం డబుల్ అయింది

Published : Aug 19, 2017, 01:00 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
భానుమతి పాత్రతో ఫేం వచ్చింది. పారితోషికం డబుల్ అయింది

సారాంశం

ఫిదా సినిమాలో భానుమతి పాత్రలో అలరించిన సాయిపల్లవి తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరైన సాయి పల్లవి తాజాగా నేమ్,ఫేమ్ రావటంతో రెమ్యునరేషన్ డబుల్ చేసిన పల్లవి

ఫిదా సినిమాలో నటించిన భానుమతి పాత్రలో అద్భుత నటనతోపాటు తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పి ప్రేక్షకుల మదిలోచెరగని ముద్ర వేసుకుని సంచలన నటిగా మారిపోయింది సాయి పల్లవి. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదాలో సాయి పల్లవి ఫీమేల్ లీడ్ గా చేసింది. ఫిదాలో చేసిన భానుమతి పాత్ర సాయి పల్లవికి ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. అంతే కాక తనకంటూ ప్రత్యేక గుర్తింపు కూడా సాధించింది పల్లవి.

ఈ సినిమాకు 30 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్న సాయి పల్లవి... లాభాల్లో కూడా కొంత షేర్ దక్కించుకోనుంది. ఇప్పుడు నేమ్, ఫేమ్ అన్నీ రావటంతో దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత ఒంటబట్టిచ్చుకున్న పల్లవి... తన పారితోషికం రెట్టింపు చేసిందని తెలుస్తోంది.

 

తాజాగా సినిమాకు రూ.60లక్షలు డిమాండ్ చేస్తోందని సమాచారం. అయితే.. తనకు రెండో సినిమా కూడా సైన్ చేయించుకున్న దిల్ రాజు.. అఢిగిన మొత్తం ఇచ్చేందుకు మనస్పూర్తిగా సిద్ధపడ్డారని తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Regina Cassandra: ముస్లింగా పుట్టి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకుందో చెప్పేసిన రెజీనా
అఖండ 2 కు ఎదురుదెబ్బ, బాలయ్య సినిమా వసూళ్లలో భారీ పతనం, 4వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?