పవన్ కు జోడీగా సాయి పల్లవి,షాకిచ్చే రెమ్యునరేషన్

By Surya Prakash  |  First Published Feb 1, 2021, 2:25 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు సాయి పల్లవి. ఆమె తమ సినిమాలో ఉంటే బిజినెస్ ఇట్టే అయ్యిపోతుంది. అదే పెద్ద స్టార్స్ సినిమాకు అయితే ఆమె స్పెషల్ ఎట్రాక్షన్. ఇప్పుడు సాయి పల్లవి ఓ అదిరిపోయే అవకాశాన్ని అందిపుచ్చుకుంది.  మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాను 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఆమె కమిటైంది. ఈ నేపధ్యంలో ఆమె ఎంత రెమ్యునేషన్ తీసుకోబోతోంది అనేది చర్చనీయాంశంగా మారింది. 


'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్ చంద్ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా ఎంపికైంది. పవన్ కు సరసన ఆమె కనిపించనుంది. అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ సినిమా మళయాళం వెర్షన్‌లో బిజూమీనన్‌ పోలీస్‌ అధికారి పాత్రలో నటించగా ఆయన భార్య పాత్రలో గౌరీనందా  కనిపించింది. అభ్యుదయ భావాలు కలిగిన యువతిగా గౌరీనందా పోషించిన పాత్రకు సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలే లభించాయి. మళయాళంలో గౌరినందా నటించిన ఆ పాత్ర కోసం తెలుగు వెర్షన్‌లో సాయిపల్లవిని  ఎంపిక చేసారు. ఈ నేపధ్యంలో ఆమె అయితే  ఫెరఫెక్ట్ గా న్యాయం చేస్తుందని నిర్మాతలు నమ్మారు. దాంతో ఆమె ఓ రేంజిలో రెమ్యునేషన్ డిమాండ్ చేసిందని సమాచారం. సాయి పల్లవి రెండు కోట్లు డిమాండ్ చేసిందని, అయితే కొంత తగ్గించి నిర్మాతలు ఫైనల్ చేసారని చెప్పుకుంటున్నారు. 

అలాగే ఈ సినిమాలో రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్‌ను చేస్తోంది. ఆమెకు కూడా భారీగానే పారితోషికం ముడుతోందని వినికిడి. ఇండస్ట్రీలో చెప్పుకునేదాని ప్రకారం.. ఈ సినిమా నిమిత్తం పవన్ దాదాపు 50 కోట్ల వరకు అందుకుంటుంటే.. రానా 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇక ఐశ్వర్య రాజేష్ కూడా దాదాపు 60 లక్షల వరకు పారితోషికం అందుకోబోతుంది. మరోవైపు సాయి పల్లవి 2 కోట్లు తీసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. 

Latest Videos

వాస్తవానికి సాయి పల్లవి క్యారక్టర్ లెంగ్త్ తక్కువగానే ఉన్నా ఇందులో ఆమె నటిస్తే సినిమాకు మరింత హైప్ వస్తుందని భావించిన నిర్మాతలు ఆమె అడిగినంత ఇస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలో సినిమా వస్తుంది. మొత్తానికి పవన్ సినిమాలో నటించడానికి రికార్డు రెమ్యునరేషన్ అందుకుంటుందన్నమాట.  ఇక ఈ సినిమాతో పాటు సాయి పల్లవి... తెలుగులో విరాట పర్వం, నాగచైతన్యతో  లవ్ స్టోరీలో కూడా నటిస్తోంది 

click me!