ఆ మధ్యన చిరుతో ‘సైరా నరసింహారెడ్డి’లో మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయ్‌గా కనిపించిన అనుష్క ఆపై ‘నిశ్శబ్దం’లో నటించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాధవన్, షాలినీ పాండే, అంజలి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. అనుష్క దివ్యాంగురాలిగా నటించిన ఈ సినిమా క్రితం సంవత్సరం అక్టోబరు 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. దీని తర్వాత ఆమె తన కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు.
అనుష్క.. ఈ పేరుకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్స్ అవి అవసరం లేదు. ఎందుకంటే ఈమె అంత పాపులర్. సౌత్ ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు చక్రం తిప్పిన ఈ భామ, 'నిశ్శబ్దం' తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ‘బాహుబలి’ తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన జేజమ్మ. ప్రస్తుతం బరువు తగ్గి మళ్లీ రీఎంట్రీతో ఇవ్వబోతోందని వినికిడి.
మాధవన్ తో చేసిన ‘నిశ్శబ్దం’ తర్వాత కొత్త చిత్రమేదీ ప్రకటించలేదు అనుష్క. ఆ సినిమా భాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాకపోవటం ఆమెను నిరాశపరిచింది. దాంతో గ్యాప్ తీసుకుని ఆమె ఓ కొత్త కథను ఓకే చేసారని సమాచారం. అయితే ఇప్పటివరకూ తాను ఏ సినిమా చేయబోతున్నారనేది కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వ లేదు. అయితే మీడియా వర్గాల మాత్రం ఉప్పు అందింది. తనతో భాగమతి చేసిన యువి క్రియేషన్స్ తోనే ముందుకు వెళ్లనుందని తెలుస్తోంది. రమేష్ అనే నూతన దర్శకుడు ఓ కథని ఆమెకు వినిపించి ఓకే చేయించుకున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఫ్యామిలీ డ్రామా గా నడిచే ఆ కథ వినగానే అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ మేరకు యువి క్రియేషన్స్ త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ ఇవ్వనున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ కథలకే ఆమె ప్రయారటీ ఇస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా తనతో పనిచేసిన నిర్మాతలలో కంఫర్ట్ గా ఉండేవారితోనే ముందుకు వెళ్తున్నారు. కొత్త నిర్మాతలు,బ్యానర్స్ తో చేయటానికి ఆసక్తి చూపడం లేదు. అలాగే అనుష్కతో చేస్తే మినిమం గ్యారెంటీ అనే నమ్మకంతో ఇప్పటికీ ఆమెపై సోలో గా సినిమా తీయటానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు.
మరో ప్రక్క సందీప్ కిషన్ హీరోగా ‘రారా కృష్ణయ్య’ చిత్రానికి దర్శకత్వం వహించిన పి. మహేశ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సైతం వార్తలు వినపడుతున్నాయి. సరికొత్త పాయింట్‌తో ఈ సినిమా కథ ఉంటుందని సమాచారం.