శ్రీవారిని దర్శించుకున్న సాయి కుమార్.. టికెట్ ధరలపై ఏమన్నారంటే

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 01, 2022, 10:29 AM IST
శ్రీవారిని దర్శించుకున్న సాయి కుమార్.. టికెట్ ధరలపై ఏమన్నారంటే

సారాంశం

నూతన సంవత్సరం సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు తిరుమలలో శ్రీవారిని సందర్శించుకున్నారు. ఈ ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయికుమార్ సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు తిరుమలలో శ్రీవారిని సందర్శించుకున్నారు. ఈ ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయికుమార్ సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే బాలీవుడ్ నటి కంగనా రనౌత్, దర్శకుడు అనిల్ రావిపూడి ఈ తెల్లవారు జామున శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 

సెలెబ్రటీలంతా సాంప్రదాయ వస్త్ర ధారణలో కనిపించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి ఆశీర్వచనాలు పలికారు. స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఈ ఏడాదికి 50 ఏళ్ల పూర్తవుతాయని చెప్పారు. ఈ ఏడాది తాను పలు భాషల చిత్రాల్లో నటిస్తున్నట్టు చెప్పిన ఆయన ఏపీలో కొనసాగుతున్న సినిమా టికెట్ల వివాదంపై స్పందించారు.

టికెట్ల ధర నిర్ణయంపై ప్రభుత్వం కమిటీ వేసిందని, వర్చువల్‌గా సమావేశం కూడా జరిగిందని పేర్కొన్నారు. టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉండాలన్న సాయికుమార్.. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

కంగనా రనౌత్ గత ఏడాది జయలలిత బయోపిక్ 'తలైవి' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రాన్ని తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. 

Also Read: న్యూ ఇయర్ కి బట్టలు బాగా పొట్టివైపోయాయే.. నాగ్ హీరోయిన్ హాట్ ట్రీట్

Also Read: Shruti Haasan fitting reply: ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ కి బ్రేకప్ చెప్పావ్.. నెటిజన్ నోరు మూయించిన శృతి హాసన్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్