‘కబాలి’డైరక్టర్ కు కేక పెట్టించే ఆఫర్..వివరాలు

Published : Nov 16, 2018, 09:42 AM IST
‘కబాలి’డైరక్టర్ కు కేక పెట్టించే ఆఫర్..వివరాలు

సారాంశం

ఈ మధ్యకాలంలో వరస పెట్టి రజనీతో రెండు సినిమాలు చేసిన డైరక్టర్ మరొకరు లేదు. ఆ అదృష్టం టాలెంటెడ్ డైరక్టర్ పా రంజిత్ కే పట్టింది. ‘కబాలి’, ‘కాలా’తో  రంజిత్ పేరు అంతటా మారుమ్రోగిపోయింది.

ఈ మధ్యకాలంలో వరస పెట్టి రజనీతో రెండు సినిమాలు చేసిన డైరక్టర్ మరొకరు లేదు. ఆ అదృష్టం టాలెంటెడ్ డైరక్టర్ పా రంజిత్ కే పట్టింది. ‘కబాలి’, ‘కాలా’తో  రంజిత్ పేరు అంతటా మారుమ్రోగిపోయింది. అందరి దృష్టీ ఆయనపై పడింది. ముఖ్యంగా అణగారిన వర్గాల కథలను ఆర్టిస్టిక్ గా తెరకెక్కించగలడనే పేరు వచ్చింది. ఇప్పుడు ఆ పేరే ఆయనకు ఓ పెద్ద ప్రాజెక్టుని తెచ్చి పెట్టింది. 

బాలీవుడ్ లో పేరు పొందిన ఓ కార్పోరేట్ హౌస్ నుండి ఒక క్రేజీ ప్రాజెక్టుకి దర్శకత్వం వహించే ఆఫర్ వచ్చింది.  ఈ చిత్రం ట్రైబల్ ఫ్రీడం ఫైటర్ బిర్సా ముండా జీవితం ఆధారం గా తెరకెక్కుతుందని సమాచారం. 

ఆదివాసీ పోరాటాల వారసత్వానికి ప్రతీకగా ఆవిర్భవించిన యోధుడు బిర్సాముండా. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల్లో సాగిన ‘మిలినేరియన్‌’ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. బిర్సాను దొంగచాటుగా బంధించిన బ్రిటీష్ దొరలు 1900 జూన్‌ 9న రాంచీ జైలులో చంపేసారు. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో బిర్సాముండా పోరాటం ఒక ప్రధాన ఘట్టం. ఇదొక స్పూర్తిదాయక సినిమా కానుంది. 

ఇప్పుడీ ట్రైబల్ ఫ్రీడం ఫైటర్ బిర్సా ముండా జీవిత కథపై సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని పా రంజిత్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని షరీమ్ మంత్రి, బియాండ్ క్లౌడ్స్ అనే సంస్ధలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించాడు.

ఈ మూవీని రూ.175 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. ఈ బయోపిక్‌లో బిర్సా ముండా పాత్రలో ఆమీర్ ఖాన్ లేదా అక్షయ్ కుమార్‌లు నటించే అవకాశాలున్నాయని బీటౌన్ వర్గాల సమాచారం. 2019 యేడాదిలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: సౌందర్య సినిమా చూసి చేతులు కాల్చుకున్న చిరంజీవి, ఇదెక్కడి గొడవరా అని తలపట్టుకున్న డైరెక్టర్
హృతిక్ రోషన్ 'క్రిష్' సినిమాలో ధోని భార్య నటించిందా?