
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా, కార్తీక్ దండు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న మిస్టీక్ థ్రిల్లర్ చిత్రం ‘విరూపాక్ష’ (Virupaksha). శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు.బి సమర్పణలో ప్రముఖ నిర్మాత బీఎస్‌ఎన్ ప్రసాద్ (BVSN Prasad) ఈ చిత్రాన్ని నిర్మిస్తుంచారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న భారీ ఎత్తున విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేసింది. ఈ నేపధ్యంలో విరూపాక్ష సినిమా ఎంత బిజినెస్ చేసింది.బ్రేక్ ఈవెన్ కావాలంటే అంటే ఎంత షేర్ కలక్షన్స్ రావాలి? ఆ వివరాలు
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...విరూపాక్ష సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి బిజినెస్ చేసింది. ఏరియా వైజ్ బిజినెస్ డిటేల్స్ లోకి వెళితే.. నైజాంలో 7.20 కోట్ల ధర పలికిన ఈ సినిమా వైజాగ్ లో 2.25 కోట్లు, ఈస్ట్ లో 1.45 కోట్లు, వెస్ట్ లో 1.25 కోట్లు, కృష్ణాలో 1.45 కోట్లు గుంటూరులో 1.65 కోట్లు, నెల్లూరులో 0.70 కోట్లు సీడెడ్ లో 3.85 కోట్లు ధర పలికింది.
ఇక వరల్డ్ వైడ్ గా : రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి విరూపాక్ష సినిమా 19.8 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. ఇక కర్ణాటకలో ఈ సినిమా ఒక కోటి వరకు బిజినెస్ చేయగా.. రెస్ట్ ఆఫ్ ఇండియా లో 50 లక్షలు ఓవర్సీస్ లో 1.5 కోట్లు, ఇక మిగతా భాషల్లో 2.2 కోట్ల రేంజ్ లో ఈ సినిమా మంచి బిజినెస్ అయితే చేసినట్లుగా తెలుస్తోంది. అలా విరూపాక్ష సినిమా 25 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి రావాలి అంటే బాక్సాఫీస్ వద్ద 26 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ తప్పనిసరిగా రావాలి. ఇప్పటికే నాన్ థియేట్రికల్ గా అయితే నిర్మాతలు మంచి ప్రాఫిట్ అందుకున్నట్లు సమాచారం.
‘విరూపాక్ష’ చిత్రం సాయిధరమ్ తేజ్‌కు చాలా కీలకమైన చిత్రం. యాక్సిడెంట్ తర్వాత అనేకంటే.. పునర్జన్మ తర్వాత మళ్లీ ఆయన చేసిన చిత్రమిది. ఈ సినిమాపై తేజ్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. మామయ్య పవన్ కల్యాణ్ ఆశీస్సులు కూడా అందుకున్న ‘విరూపాక్ష’ చిత్రం ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ సరసన సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్‌గా నటించింది. సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings), శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర (SVCC) సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.