Virupaksha Teaser : ‘ఆ ప్రమాదం దాటడానికే నా ప్రయాణం’.. ఇంతకీ ఏంటా ప్రమాదం.!

Published : Mar 02, 2023, 06:38 PM IST
Virupaksha Teaser : ‘ఆ ప్రమాదం దాటడానికే నా ప్రయాణం’.. ఇంతకీ ఏంటా ప్రమాదం.!

సారాంశం

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘విరూపాక్ష’. తాజాగా చిత్ర  యూనిట్ ఆసక్తికరమైన టీజర్ ను విడుదల చేశారు.   

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రెండేండ్ల తర్వాత వెండితెరపై అలరించబోతున్నారు.  చివరిగా  పొలిటికల్ డ్రామా ‘రిపబ్లిక్’తో ఆడియెన్స్ చేత శభాష్ అనిపించుకున్నారు. ప్రస్తుతం ఓ వినూత్నమైన కథతో  అలరించేందుకు సిద్ధం అయ్యారు. లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం  Virupaksha. ప్రస్తుతం తుదిశ షూటింగ్ లో ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. నిన్ననే రావాల్సిన ఈ చిత్ర టీజర్  మెగా అభిమాని మరణంతో అతనికి నివాళి అర్పిస్తూ ఈరోజుకు వాయిదా వేశారు.  

తాజాగా ‘విరూపాక్ష’ చిత్ర టీజర్ విడుదలైన ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. మిస్టరీ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటోంది. ఓ ప్రాంతంలో ఎప్పుడూ జరిగని ఘటనతో వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కోవడమే హీరో లక్ష్యంగా తెలుస్తోంది.  ఇంతకీ ఆ ప్రమాదం ఏంటీ? సాయి ధరమ్ తెజ్ ఏం చేశాడనే సందేహాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. టీజర్ లో విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. బీజీఎం కూడా అదిరిపోయింది. దీంతో సినిమాపై హైప్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం టీజర్ యూట్యూబ్, ఇంటర్నెల్ లో దూసుకుపోతోంది. చివరల్లో సాయి ధరమ్ చెప్పిన  ‘

1990 నేపథ్యంలో ఫారెస్ట్‌ బేస్డ్‌ విలేజ్‌లో జరిగే థ్రిల్లర్‌ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ చిత్రం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆసక్తిని పెంచగా.. టీజర్ మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. పైగా చిత్రానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ అందించిన విషయం తెలిసిందే.  ‘ఆ ప్రమాదం దాటడానికే నా ప్రయాణం’ అంటూ చెప్పిన డైలాగ్ ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రానికి  కార్తీ దండు దర్శకత్వం వహిస్తున్నారు. బాపినీడు బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర్ సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 21న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియన్ చిత్రంగా విడుదల కాబోతోంది. 

PREV
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్