ప్రస్థానం, ఆటోనగర్ సూర్య వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దేవా కట్ట ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటించింది. ఇక ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
షూటింగ్స్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న నిర్మాతల చూపు ఓటీటీల వైపు మరులుతోంది. సెకండ్ వేవ్ ప్రభాసంతో ఇంటివద్దనే జనం ఉంటూండటంతో ఓటీటీలలో విడుదలైన సినిమాలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే అనేకమంది స్టార్ హీరోల సినిమాలు సైతం ఓటీటీలలో విడుదలై సూపర్ హిట్ అందుకున్నాయి. దాంతో ప్రస్తుత పరిస్థితులలో తమ సినిమాలను ఓటీటీ వేదికలలో రిలీజ్ చేయడం మంచిదని పెద్ద నిర్మాతలు సైతం భావిస్తున్నారు.
తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అప్ కమింగ్ మూవీ రిపబ్లిక్ కూడా ఓటీటీలో విడుదల కానునన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం ఈ సినిమాకు అదిరిపోయే ఓటిటి రేటు రావటమే అంటున్నారు. ఈ సినమా నెగిటివ్ రైట్స్ ని జీ స్టూడియోస్ వారు రికార్డ్ స్దాయి రేటు చెల్లించి పొందారని చెప్పుకుంటున్నారు. ఇది ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో రికార్డ్ డీల్ గా చెప్పుకుంటున్నారు.
ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రైట్స్ నిమిత్తం నలభై కోట్లు చెల్లించారు. ఇందులో డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, థియోటర్ రైట్స్ అన్ని కలిసే ఉన్నాయి. నిర్మాతలు పెట్టిన పెట్టుబడికు ఇది చాలా మంచి డీల్ అంటున్నారు. అతి తక్కువ రోజుల్లో సినిమాని దేవకట్టా పూర్తి చేసి, డబ్బుని ఆదాచేయటం కలసొచ్చిందని చెప్పుతునన్నారు. అలాగే సాయి తేజ చిత్రాల్లో ఫ్యాన్సీ డీల్ గా అభివర్ణిస్తున్నారు. థియోటర్ రిలీజ్ ద్వారా వచ్చే లాభాల్లో 18 శాతం దాకా రెవిన్యూని తీసుకుంటారని ఎగ్రిమెంట్ లో ఉంది. దీంతో నిర్మాతలు భగవాన్, పుల్లారావు లు మంచి ప్రాఫిట్ పొందిట్లు అవుతుంది.
ఈ డీల్ ని నలభై కోట్లకు క్లోజ్ జీ స్టూడియోస్ వారు పిబ్రవరిలోనే క్లోజ్ చేసారట. అప్పటికి ఇంకా సెకండ్ వేవ్ ప్రారంభం కాలేదు. అయితే సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ద్వారా 32 కోట్లు దాకా జీ స్టూడియోస్ వారు సంపాదించారు. దాంతో రిపబ్లిక్ పై ఎంతైనా పెట్టడనికి ఉత్సాహం చూపించారు.
ప్రస్థానం, ఆటోనగర్ సూర్య వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దేవా కట్ట ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటించింది. ఇక ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాను ముందుగా జూన్ 4న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఇక ఈ క్లిష్ట పరిస్థితులలో కొన్ని ఓటీటీ సంస్థలు మంచి ఆఫర్లను అందిస్తుండడంతో.. రిపబ్లిక్ మేకర్స్ కూడా ఆ దిశగా వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా టాక్.