అభిమానుల అంకిత భావానికి ధన్యవాదాలు తెలిపిన రామ్‌చరణ్‌

Published : Jun 05, 2021, 05:26 PM IST
అభిమానుల అంకిత భావానికి ధన్యవాదాలు తెలిపిన రామ్‌చరణ్‌

సారాంశం

లాక్‌ డౌన్‌ టైమ్‌లో అభిమానులు చేస్తూ అవిశ్రాంత సహాయం పట్ల ముగ్దుడైన చరణ్‌ తాజాగా వారికి థ్యాంక్స్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఓ లేఖని ట్విట్టర్‌ ద్వారా పోస్టర్‌ చేశారు. 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. లాక్‌ డౌన్‌ టైమ్‌లో అభిమానులు చేస్తూ అవిశ్రాంత సహాయం పట్ల ముగ్దుడైన చరణ్‌ తాజాగా వారికి థ్యాంక్స్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఓ లేఖని ట్విట్టర్‌ ద్వారా పోస్టర్‌ చేశారు. అలాగే అభిమానులు చేస్తున్న ఫోటోలను ఓ వీడియో రూపంలో మలిచి అభిమానులతో పంచుకుంటూ థ్యాంక్స్ చెప్పారు. 

`అభిమానులు ఈ కోవిడ్‌ 19 మహమ్మారి సమయంలో కష్టపడి చేస్తున్న ఈ సమాజ సేవ గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సామాన్యుడికి సహాయం చేయడం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వరకు మీరు ఎంతో అంకిత భావంతో పనిచేశారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సహాయం చేసిన మీ అందరికీ పేరు పేరున నా శుభాభినందనలు. మీ అందరి అంకిత భావానికి నా ధన్యవాదాలు` అని తెలిపాడు చరణ్‌. 

ఈ సందర్బంగా అభిమానులు సైతం చరణ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు తండ్రి చిరంజీవితో కలిసి చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేసి కరోనాతో పోరాడుతున్న వారికి ఆక్సీజన్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. 

ఇక రామ్‌చరణ్‌ ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ మరో హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. చెర్రీ సరసన అలియాభట్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు చిరంజీవితో కలిసి `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. అలాగే నెక్ట్స్ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు చరణ్‌. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్