సంక్రాంతి కంటే ముందే వస్తున్న మెగా హీరో?

Published : Aug 27, 2019, 04:23 PM IST
సంక్రాంతి కంటే ముందే వస్తున్న మెగా హీరో?

సారాంశం

  వరుస అపజయాల అనంతరం మెగా యువ హీరో సాయి ధరమ్ తేజ్ మొత్తానికి చిత్రలహరితో సెట్టయ్యాడు. ఇక నెక్స్ట్ మరో సినిమాతో ఫెస్టివల్ సీజన్ లో ఆడియెన్స్ ని ఆకర్షించడానికి రెడీ అవుతున్నాడు

వరుస అపజయాల అనంతరం మెగా యువ హీరో సాయి ధరమ్ తేజ్ మొత్తానికి చిత్రలహరితో సెట్టయ్యాడు. ఇక నెక్స్ట్ మరో సినిమాతో ఫెస్టివల్ సీజన్ లో ఆడియెన్స్ ని ఆకర్షించడానికి రెడీ అవుతున్నాడు. మారుతి డైరెక్షన్ లో ప్రతి రోజు పండగే అనే సినిమాలో నటిస్తున్న సాయి రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ ఏడాది సంక్రాంతి వస్తున్నట్లు మొదట కొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే అప్పుడు పెద్ద సినిమాలు ముందే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవడంతో వాటికంటే ముందే క్రిస్టమస్ కి రావాలని మెగా హీరో ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సగం షూటింగ్ ని పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ వీలైనంత త్వరగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చెయ్యాలని అనుకుంటోంది. 

సినిమాను నవంబర్ లో ఫినిష్ చేసి క్రిస్టమస్ కి రిలీజ్ చేయాలనీ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన రెండవసారి రాశి ఖన్నా నటిస్తోంది. ఇదివరకే ఈ ఇద్దరు సుప్రీమ్ సినిమాలో కలిసి నటించి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నారు. యూవీ క్రియేషన్స్ - జిఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  

PREV
click me!

Recommended Stories

2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?
ర‌జినీకి త‌ల్లిగా, ల‌వ‌ర్‌గా, భార్య‌గా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా