చైతు, సాయి పల్లవి.. కులం కాన్సెప్ట్!

By AN TeluguFirst Published Aug 27, 2019, 4:03 PM IST
Highlights

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
 

ఫీల్ గుడ్ కథలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈసారి మాత్రం కులం కాన్సెప్ట్ ని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య, సాయి పల్లవిలతో కలిసి శేఖర్ కమ్ముల సినిమాను రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కులం కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

అంతేకాదు సినిమాలో లైంగిక వేధింపుల అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమా మొత్తం తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. సినమాలో  నాగచైతన్య .. తెలంగాణా స్లాంగ్ మాట్లాడుతారు. అందుకోసం ఆయన ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం.

‘ఫిదా’ సినిమాలో సాయి పల్లవి తెలంగాణ యాసతో యువత మనసు దోచుకున్న సాయి పల్లవి మరోసారి తెలంగాణా యాసలో మాట్లాడబోతుంది. ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. 

ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల ఆరంభంలో మొదలుపెట్టనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 2019 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

click me!