అందరిలో అనుమానాలు.. రంగంలోకి దిగుతున్న తేజు, నెక్స్ట్ మూవీ అప్డేట్

By telugu teamFirst Published Oct 6, 2021, 9:57 AM IST
Highlights

బైక్ నుంచి పడి ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తేజు ఆరోగ్యం మెరుగుపడింది. దాదాపుగా కోలుకున్నాడు.

బైక్ నుంచి పడి ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తేజు ఆరోగ్యం మెరుగుపడింది. దాదాపుగా కోలుకున్నాడు. మరికొన్ని రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తేజు త్వరలోనే డిశ్చార్జ్ అవుతాడని వైష్ణవ్ తేజ్ ఇప్పటికే ప్రకటించాడు. 

ఇక అభిమానుల సంతోషాన్ని రెట్టింపు చేస్తూ Sai Dharam Tej స్వయంగా ఆసుపత్రి నుంచి ట్వీట్ చేసి సర్ ప్రైజ్ చేశాడు. దీనితో తేజు హెల్త్ కండిషన్ ఆల్ రైట్ అంటూ సంకేతాలు అందాయి. ఇదిలా ఉండగా తేజు విషయంలో మరో అంశం అభిమానుల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. 

బైక్ నుంచి పడడంతో కాస్త బలమైన గాయాలే తేజుకి తగిలాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోలుకున్నప్పటికీ సినిమా షూటింగ్స్ లో పాల్గొనాలంటే కాస్త టైం పడుతుంది. దీనితో తేజు ఎప్పటి నుంచి తిరిగి కెమెరా ముందుకు వస్తాడు అనే ప్రశ్న అందరిలో ఉంది. ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. 

Also Read: బుల్లితెర రావణుడు అరవింద్ త్రివేది ఇకలేరు!

తేజు ఆరోగ్యం పూర్తిగా మెరుగైనట్లు తెలుస్తోంది. డిశ్చార్జ్ అయ్యాక ఈ అక్టోబర్ నెల మొత్తం వైద్యుల సలహాలు పాటిస్తూ నార్మల్ కాబోతున్నాడు. ఇక నవంబర్ నుంచి తన చిత్రాల షూటింగ్స్ కోసం తేజు రంగంలోకి దిగుతాడట. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తేజు ఓ థ్రిల్లర్ చిత్రంలో నటించబోతున్నాడు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 

Also Read: బ్యాన్ చేసిన టాలీవుడ్ కి అధ్యక్షుడు కావాలనుకుంటున్నారు... రివేంజ్ కోసమేనా? ప్రకాష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. తేజు ఆరోగ్యంగా బయటకు వస్తే చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా న్యూస్ వారికి శుభవార్త అని చెప్పొచ్చు. తేజు చివరగా రిపబ్లిక్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. 

వినాయక చవితి రోజున తేజు తన బైక్ పై వెళుతూ మాదాపూర్ వద్ద ప్రమాదానికి గురికావడం జరిగింది. తేజు ప్రమాదానికి గురయ్యాక మెగా ఫ్యామిలీ మొత్తం తేజు కోసం పరితపించింది. చిరంజీవి, పవన్, నాగబాబు, అల్లు అరవింద్ తరచుగా తేజు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. 

click me!