బుల్లితెర రావణుడు అరవింద్ త్రివేది ఇకలేరు!

By team teluguFirst Published Oct 6, 2021, 8:27 AM IST
Highlights

దూరదర్శన్ లో ప్రసారమైన రామానంద్ సాగర్ రామాయణం తెలియనివారంటూ ఎవరూ ఉండరు. ఇండియన్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రామాయణ సీరియల్ లో Arvind trivedi రావణుడు పాత్ర చేశారు.

సీనియర్ నటుడు అరవింద్ త్రివేది మంగళవారం రాత్రి ముంబైలో తుది శ్వాసవిడిచారు. అరవింద్ త్రివేది వయసు 82ఏళ్ళు కాగా, కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత రాత్రి ఆయన గుండెపోటుకు గురికావడంతో పాటు, మల్టీ ఆర్గాన్ ఫైల్యూర్ కారణంగా మృతి చెందినట్లు తెలుస్తుంది. నేడు ఉదయం ఆయన భౌతిక కాయానికి ముంబైలో అంత్యక్రియలు జరగనున్నాయి. అరవింద్ త్రివేది మరణవార్త తెలుసుకున్న చిత్ర ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 


దూరదర్శన్ లో ప్రసారమైన రామానంద్ సాగర్ రామాయణం తెలియనివారంటూ ఎవరూ ఉండరు. ఇండియన్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రామాయణ సీరియల్ లో Arvind trivedi రావణుడు పాత్ర చేశారు. లాక్ డౌన్ సమయంలో ఈ సీరియల్ ని పునఃప్రసారం చేయగా, వరల్డ్ రికార్డు స్థాయి టీఆర్పీ దక్కించుకుంది. దీనితో ఈ సీరియల్ నటుల గురించి, మరోమారు ప్రేక్షకులు ప్రత్యేకంగా చర్చించుకున్నారు. 


గుజరాతీ చిత్ర పరిశ్రమకు 40ఏళ్ళు సేవలు అందించిన అరవింద్ త్రివేది, హిందీతో పాటు పలు బాషలలో కలిపి 300 పైగా చిత్రాల్లో నటించారు. సెన్సార్ బోర్డు యాక్టింగ్  చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే సబర్కత నియోజకవర్గం నుండి ఎన్నికైన ఆయన 1991-96 కాలానికి గాను పార్లమెంట్ మెంబర్ గా ఉన్నారు.  

click me!