సక్సెస్ కోసం మెగా మేనల్లుడి ముందు జాగ్రత్త?

Published : Jul 17, 2019, 11:14 AM ISTUpdated : Jul 17, 2019, 11:16 AM IST
సక్సెస్ కోసం మెగా మేనల్లుడి ముందు జాగ్రత్త?

సారాంశం

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో  ప్రతి రోజు పండగే అనే సినిమా చేస్తున్నాడు. పొంగల్ కి రానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే కథల ఎంపిక విషయంలో సాయి జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది.    

మెగా యువ హీరో సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు చిత్రలహరి సినిమాతో పర్వాలేదనిపించే విధంగా సక్సెస్ అందుకున్నాడు. ఎలాంటి విజయాలు లేనప్పుడే సాయి ధరమ్ తేజ్ వరుస అవకాశాలను అందుకున్నాడు. ఇక ఇప్పుడు మనోడికి అవకాశాల డోస్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరూ చర్చించుకుంటున్నారు. 

కానీ సాయి మాత్రం ఇక నుంచి తొందరపడి సినిమాలను సెలెక్ట్ చేసుకోవద్దని డిసైడ్ అయ్యాడట. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ప్రతిరోజు పండగే అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని వేగంగా పూర్తి చేసిన చిత్రి యూనిట్ వీలైనంత త్వరగా మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేయాలనీ ప్లాన్ చేస్తోంది. 

ఇక రీసెంట్ గా నాలుగు కథలు విన్న సాయి ధరమ్ ఏ ఒక్క కథను ఒకే చేయలేదట. అందులో ఒక కథ బావున్నప్పటికీ తనకు సెట్టవ్వదని దర్శకుడిని నొప్పించకుండా మరో కథ రెడీ చెయ్ అని భరోసా ఇచ్చాడట. కథ నచ్చకుంటే వెంటనే మొహం మీద చెప్పేస్తున్నాడట. మరి ఈ ఆలోచనతో మెగా మేనల్లుడు కెరీర్ లో ఎలాంటి హిట్స్ అందుకుంటాడో చూద్దాం. మారుతి సినిమాను పొంగల్ కి రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.  

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి