
మంచు విష్ణు త్వరలో తాను కొంతమందికి షాక్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అయితే డైరక్ట్ గా కాదు ఓ వెబ్ సీరిస్ తో ఆయన షాక్ ఇస్తారట. ఆ విషయం ఆయనే స్వయంగా ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా ఆ వెబ్ సీరిస్ ఉంటుందని వినపడుతోంది. ఇంతకీ ఆ వెబ్ సీరిస్ పేరు ఏమిటంటే చదరంగం.
వివరాల్లోకి వెళితే.. తాజాగా హీరో మంచు విష్ణు కూడా ‘చదరంగం’ పేరుతో ఓ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సిరీస్‌కి నటుడు మంచు మోహన్‌బాబు క్లాప్ ఇచ్చారు. ‘‘కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందనుంది.. ఇది కొంత మందికి షాక్ ఇస్తుంది’’ అని మంచు విష్ణు ట్వీట్ చేశారు.