సాయిధరమ్‌ తేజ్‌ కొత్త సినిమా టైటిల్‌ అదిరిపోయింది..? ఎన్టీఆర్‌ వాయిస్‌తో అనౌన్స్ మెంట్

Published : Dec 05, 2022, 05:00 PM ISTUpdated : Dec 05, 2022, 05:01 PM IST
సాయిధరమ్‌ తేజ్‌ కొత్త సినిమా టైటిల్‌ అదిరిపోయింది..? ఎన్టీఆర్‌ వాయిస్‌తో అనౌన్స్ మెంట్

సారాంశం

ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న సాయిధరమ్‌ తేజ్‌ ఇప్పుడు రెట్టింపు ఎనర్జీతో వస్తున్నారు. ఆయన కొత్త సినిమాకి సంబంధించిన అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది.

సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదం నుంచి ఆల్మోస్ట్ పూర్తిగా కోలుకున్నారు. రెట్టింపు ఎనర్జీతో ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నారు. ఆయన ఇటీవల కొత్త సినిమాలను కూడా ప్రారంభించారు. అందులో ఓ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ రాబోతుంది. కార్తీక్‌ దండు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమా అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. ఈ నెల 7న(బుధవారం) టైటిల్‌ గ్లింప్స్ ని విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్ కి ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ ఇస్తుండటం విశేషం. గ్లింప్స్ కి మాత్రమే కాదు, సినిమాలో కూడా ఆయన వాయిస్‌ ఓవర్‌ ఉంటుందని సమాచారం.  తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ వీడియో గ్లింప్స్ ని విడుదల చేశారు. గాంభీర్యమైన తారక్‌వాయిస్‌తో ఈ టైటిల్‌ ఫస్ట్ లుక్‌ ఉంటుందని పేర్కొన్నారు. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. 

ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సినిమాకి `విరూపాక్ష` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. `విరూపాక్ష` అంటే శివుడి రూపం అనే అర్థం వస్తుంది. మరి సినిమాలో సాయిధరమ్‌ తేజ్‌ పాత్ర అదే తరహాలో ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా విడుదలైన ప్రీ లుక్‌ ఆకట్టుకుంటుంది. అర్థరాత్రి జనాన్ని చైతన్యం చేసేలా ఆయన పాత్ర ఉంటుందనిపిస్తుంది.

ఇదిలా ఉంటే టైటిల్‌ని బట్టి చూస్తుంటే ఇందులో కాస్త ఆధ్యాత్మిక కోణం యాడ్‌ చేయబోతున్నారా అనే సందేహం కలుగుతుంది. ఇటీవల కాలంలో దేవుడి రిలేటెడ్‌ అంశాలతో రూపొందిన చిత్రాలు ఘన విజయం సాధిస్తున్నాయి. ఇప్పుడు సాయిధరమ్‌ తేజ్‌ అదే ట్రెండ్‌ ఫాలో అవుతున్నారా? అనేది సస్పెన్స్.. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. సాయిధరమ్‌ తేజ్‌కి జోడీగా సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటసి్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్, ఎస్వీసీసీ పతాకాలపై సుకుమార్‌, బివిఎస్‌ఎన్ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: హస్పిటల్లో దీప- దశరథను రెచ్చగొట్టిన జ్యో- నిజం చెప్పేశాడా?
Mansion House Mallesh Movie Review: మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ రివ్యూ.. అడల్ట్ కామెడీతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?