నయనతార మరో హర్రర్‌ థ్రిలర్‌.. క్రిస్మస్‌ కానుకగా `కనెక్ట్`

Published : Dec 05, 2022, 04:07 PM IST
నయనతార మరో హర్రర్‌ థ్రిలర్‌.. క్రిస్మస్‌ కానుకగా `కనెక్ట్`

సారాంశం

నయనతార ఇప్పటికే హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రాలతో మెరిసింది. ఇప్పుడు మరోసారి అలరించేందుకు వస్తుంది. `కనెక్ట్` అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్‌ కాబోతుంది.

లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంటుంది లేడీ సూపర్‌స్టార్‌ నయనతార. ఆమె స్టార్‌ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తుంది. బాక్సాఫీసు వద్ద వసూళ్లని రాబడుతుంది. సౌత్‌ సినిమాని ఏలుతున్న నయనతార ఇప్పటికే హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రాలతో మెరిసింది. ఇప్పుడు మరోసారి అలరించేందుకు వస్తుంది. `కనెక్ట్` అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని థియేటర్లలో సందడి చేసేందుకు వస్తుంది. తమిళంలో రూపొందిన ఈచిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు. 

నయనతార నటించిన హర్రర్‌ థ్రిల్లర్‌ `కనెక్ట్` సినిమాని యూవీ క్రియేషన్స్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్‌ శివన్‌ తమిళంలో నిర్మించారు. అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ నెల 22న క్రిస్మస్‌ కానుకగా తెలుగులోనూ విడుదల చేయబోతుంది. 

హర్రర్‌ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ స్పెషలిస్ట్. నయనతార నాయికగా ఆయన రూపొందించిన "మయూరి" సినిమా తెలుగులో విజయాన్ని సాధించింది.  అలాగే తాప్సీ నాయికగా శరవణన్ తెరకెక్కించిన `గేమ్ ఓవర్` కూడా సూపర్ హిట్టయ్యింది. `కనెక్ట్` చిత్రాన్ని కూడా ఆయన ఇంతే ఆసక్తి కలిగించేలా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇటీవల నయనతార పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన `కనెక్ట్‌` టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. 

ఈ చిత్రాన్ని ఈ నెల 22న తెలుగులో గ్రాండ్ గా విడుదల చేసేందుకు యూవీ క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్ మూవీ చూడాలనే ఆసక్తిని కలిగిస్తున్నాయని చిత్ర బృందం తెలిపింది.. అనుపమ్‌ ఖేర్‌తోపాటు సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి  సంగీతం - పృథ్వి చంద్రశేఖర్‌, సినిమాటోగ్రఫీ - మణికంఠన్ కృష్ణమాచారి, ఎడిటింగ్ - రిచర్డ్ కెవిన్.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?