తుపాను బాధితుల కోసం సంపూర్ణేష్ బాబు విరాళం!

By Prashanth MFirst Published Oct 14, 2018, 3:24 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాను ఇటీవల తితలీ తుపాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇంకా తుపాను ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంది. 

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాను ఇటీవల తితలీ తుపాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇంకా తుపాను ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంది. అయితే నష్టపోయిన వారిని ఆదుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు. 

అయితే తెలుగు చిత్ర పరిశ్రమ నుండి మొదటి వ్యక్తిగా సంపూర్ణేష్ బాబు నిలబడ్డాడు. తన వంతు సాయంగా 50 వేల రూపాయలు సిక్కోలు ప్రాంత వాసులకు అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రిలీఫ్ ఫండ్ కి అందజేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. 

శ్రీకాకుళం వాసులు తుపాను కారణంగా చాలా నష్టపోయారని స్నేహితుల ద్వారా తెలుసుకున్నట్లు చెబుతూ.. తనవంతు ఆర్థిక సహాయాన్ని ప్రకటించానని అన్నాడు. అదే విధంగా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు మంచి మనసుతో ముందుకు రావాలని తనదైన శైలిలో సంపూర్ణేష్ బాబు పిలుపునిచ్చారు. 

ప్రస్తుతం ఇందుకు సంబందించి వార్త మీడియాల్లో చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం వాసుల కోసం సాయం అందించిన మొదటి సినీ నటుడు సంపూర్ణేష్ బాబు కావడం విశేషం.  

click me!