రెండు భాగాలుగా రాబోతున్న ‘సలార్’.. కన్ఫమ్ చేసిన కన్నడ నటుడు దేవరాజ్..

By Asianet News  |  First Published Apr 16, 2023, 8:35 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో ‘సలార్’ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై తాజాగా కన్నడ  నటుడు దేవరాజ్ దిమ్మతిరిగే అప్డేట్ అందించారు. దాంతో మరింతగా అంచనాలు పెరిగాయి. 
 


సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేజీఎఫ్ ఛాప్టర్ 1 మరియు ఛాప్టర్ 2తో ప్రేక్షకులను మెప్పించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం  కురిపించారు. దీంతో ప్రస్తుతం ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న Salaar కోసం ప్రపంచ వ్యాప్తంగా డార్లింగ్ అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. దీంతో త్వరలో సాలిడ్ అప్డేట్ ను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. కన్నడ విలన్ దేవరాజ్ (Devaraj) ‘సలార్’పై సూపర్ అప్డేట్ అందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సలార్ రెండు భాగాలుగా రానుందని కన్ఫమ్ చేశారు. ఇందులో తను రెండు పార్టుల్లోనూ ఉంటారని, ప్రభాస్ తోనే తన సన్నివేశాలు కీలకంగానూ ఉంటాయని చెప్పారు. అయితే కొద్దిరోజులు సలార్ రెండు పార్టులుగా రానుందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ అందలేదు. తాజాగా దేవరాజ్ కన్ఫమ్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

Latest Videos

మొత్తానికి ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’ ఫార్మూలానే ‘సలార్’కు కూడా ఉపయోగిస్తున్నారని అర్థం అవుతోంది. కేజీఎఫ్ రెండు చాఫ్టర్లతో సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ‘సలార్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాపై అంచనాలు పెరగడంతో ప్రీ రిలీజ్ బిజినెస్సే దాదాపు రూ.600 నుంచి రూ.700 కోట్ల వరకు జరుగుతుందని అంటున్నారు. ఈలెక్కన ‘సలార్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయబోతుందని అర్థం అవుతోంది.

ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. శ్రుతి హాసన్ డార్లింగ్ కు జోడీగా నటిస్తోంది. చిత్రాన్ని హోంబాలే ఫిల్మ్స్ వారు దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రవి బర్సూర్ సంగీతం అందిస్తున్నారు. జగపతి బాబు, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  సెప్టెంబర్ 28న చిత్రం వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక ప్రభాస్ అటు ‘ప్రాజెక్ట్ కే’తోనూ బిజీగా ఉన్నారు. అలాగే మారుతీ దర్శకత్వంలోనూ నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతూనే ఉంది.

click me!