చిరు సలహా... ప్లాన్ మార్చుకున్న సాయి తేజ్

By Surya PrakashFirst Published Oct 5, 2020, 5:49 PM IST
Highlights


మంచి బజ్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను జీ5 కు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి.  అయితే ఆ సంస్థ త‌మ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు ఉచితంగా ఈ సినిమాను చూసేందుకు అవకాశం ఇవ్వడం లేదు.  జీప్ల‌స్ పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తికి శ్రీకారం చుట్టింది. 

ఫ్లాఫ్ ల నుంచి కోలుకున్న మెగా మేనల్లుడు సాయి తేజ్ మళ్లీ ఫుల్ పామ్ లోకి వచ్చేసాడు. ఆయన గత రెండు సినిమాలు చిత్రలహరి, ప్రతి రోజు పండగే సినిమాలు మంచి విజయాలు అందుకున్నాడు. సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌ సినిమా విడుదలకు రెడీగా ఉంది. త్వరలో ఈ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలుకరించబోతుంది.  సాయి తేజ్, హాట్ హీరోయిన్ న‌భా న‌టేష్ జంట‌గా సుబ్బు అనే కొత్త ద‌ర్శ‌కుడు రూపొందించిన ఈ చిత్రాన్ని సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ నిర్మించారు. 

మంచి బజ్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను జీ5 కు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి.  అయితే ఆ సంస్థ త‌మ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు ఉచితంగా ఈ సినిమాను చూసేందుకు అవకాశం ఇవ్వడం లేదు.  జీప్ల‌స్ పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తికి శ్రీకారం చుట్టింది. ఇప్ప‌టికే క‌పేర‌ణ‌సింగం అనే త‌మిళ చిత్రాన్ని, ఖాలిపీలి అనే హిందీ చిత్రాన్ని ఇదే తరహాలో విడుదల చేసింది. వీటికి వ‌రుస‌గా 199, 299 రేటు ఫిక్స్ చేసింది. ఇదే త‌ర‌హాలో సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ చిత్రాన్ని కూడా పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో అతి త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌నున్నార‌ట.

 అయితే పే పర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేస్తే ఎంతవరకూ తమ సినిమాను జనం ఆదరిస్తారనేది ఇప్పుడు టీమ్ ముందు పెద్ద ప్రశ్నగా మారింది. దాంతో వారు ఓటీటి నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. ఓ ప్రక్కన ఈ నెల 15 నుంచి థియోటర్స్ తిరిగి ఓపెన్ అవుతున్న నేపధ్యంలో తాము కంగారుపడటం అనవసరం అని భావిస్తున్నారట. పరిస్దితిలు బాగుండి జనం థియోటర్స్ కు వెళితే క్రిసమస్ కానుకగా సినిమాని థియోటర్స్ లో రిలీజ్ చేద్దామనే ఆలోచన చేస్తున్నారట. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ట‌. ఈ విషయమై తన మామయ్య చిరంజీవి సలహాను సాయి తేజ అడగటం జరిగితే ..ఆయన కూడా కొద్ది రోజులు వెయిట్ చేయమన్నారట.

click me!