ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ తన పెళ్లి గురించి దాచి డేటింగ్ చేసిందట

By Satish ReddyFirst Published Oct 5, 2020, 4:33 PM IST
Highlights

బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ పరాస్ చాబ్రా ప్రస్తుత సీజన్ కంటెస్టెంట్ పవిత్ర పూనియాపై సంచలన ఆరోపణలు చేశాడు. పెళ్లయిందన్న విషయం దాచి తనతో డేటింగ్ చేసిందని తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. 

బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ పరాస్ చాబ్రా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పవిత్ర పూనియాపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె తనతో డేటింగ్ చేస్తూ తనకు పెళ్లైందన్న విషయం దాచిందని చెప్పడం సంచలనంగా మారింది. ఈ విషయం పవిత్రా పూనియా భర్త నుండి తెలుసుకుని తాను షాక్ అయినట్లు మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రెండు రోజుల క్రితం మొదలైన బిగ్ బాస్ హిందీ సీజన్ 14లో పాల్గొన్న పవిత్ర పూనియాపై ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి. 

బుల్లితెర నటులు అయిన పరాస్ చాబ్రా, పవిత్ర పూనియా 2018లో డేటింగ్ చేయడం జరిగింది.ఈ సమయంలో పవిత్ర పునియా భర్త పరాస్ చాబ్రాకు ఫోన్ చేసి ఇబ్బందికర వ్యాఖ్యలు చేశాడట. మీరు డేటింగ్ చేయడం వలన నాకు ఇబ్బంది లేదు. కానీ పవిత్ర పునియాతో తనకు విడాకులు వచ్చే వరకు మీరు హద్దుల్లో ఉండండీ అన్నారట. ఆ ఫోన్ కాల్ తో పరాస్ చాబ్రా షాక్ గురయ్యారట. వీరిద్దరికీ బ్రేకప్ అయిన తరువాత పవిత్ర పునియా ఓ సందర్భంలో పరాస్ చాబ్రాతో డేటింగ్ చేసి తప్పుచేశాను అన్నారు.
 
ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ అవును ఆమె చెప్పింది నిజమే, పెళ్లి అయ్యిందన్న విషయాన్ని నా దగ్గర దాచి డేటింగ్ చేయడం ఆమె చేసిన తప్పే అని సెటైర్ వేశారు. పరాస్ మరియు పవిత్ర బోల్డ్ రియాలిటీ షో స్పిట్ విల్లా ద్వారా కెరీర్ ప్రారంభించారు. ఆ షో చిత్రీకరణ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు సమాచారం. పవిత్ర పునియాతో బ్రేక్ అప్ తరువాత పరాస్ ఆకాంక్ష పూరితో డేటింగ్ చేయడం జరిగింది. 

click me!