మెగాఫ్యాన్స్ వల్లే బ్రతికిపోతున్నా: మెగా మేనల్లుడు

Published : Mar 13, 2019, 05:05 PM ISTUpdated : Mar 13, 2019, 07:36 PM IST
మెగాఫ్యాన్స్ వల్లే బ్రతికిపోతున్నా: మెగా మేనల్లుడు

సారాంశం

మెగా యువ హీరోల్లో చాలా వేగంగా క్లిక్కయిన నటుడు సాయి ధరమ్ తేజ్. కమర్షియల్ సినిమాలతో కొత్త తరహా ప్రయోగాలు చేస్తోన్న సాయి ధరమ్ తేజ్ ఈ సారి చిత్రలహరి అంటూ వెరైటీ సినిమాతో రాబోతున్నాడు. నేను శైలజా దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఆ సినిమా టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. 

ఇక సుప్రీమ్ తరువాత ఈ మెగా మేనల్లుడు ఇంతవరకు హిట్టందుకోలేదు. ఆ విషయాన్నీ మీడియా ముందు ఒప్పేసుకున్నాడు. గత ఆరు సినిమాలు చాలా నీరాశపరిచాయని అయితే మెగా ఫ్యాన్స్ సపోర్ట్ తోనే ఇంకా నా సినీ కెరీర్ బ్రతికుందని సాయి వివరణ ఇచ్చాడు. 

అయితే ఈసారి తప్పకుండా చిత్రలహరి సినిమా అందరిని మెప్పిస్తుందని సాయి ఈవెంట్ లో సినిమా గురించి మాట్లాడాడు. సినిమాలో సునీల్ కూడా డిఫరెంట్ కామెడీ రోల్ లో కనిపించబోతున్నట్లు టీజర్ లోనే చెప్పేశారు. సాయి సరసన హలో బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ - నివేత పేతురేజ్ నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 

రాజమౌళి బాక్స్ ఆఫీస్ ట్రాక్.. 3 నుంచి 300 కోట్ల ప్రయాణం! 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!