విజయ్ దేవరకొండ 'హీరో'కి కష్టాలు!

Published : Mar 13, 2019, 04:40 PM IST
విజయ్ దేవరకొండ 'హీరో'కి కష్టాలు!

సారాంశం

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి తెలుగుతో పాటు తమిళంలో కూడా తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో బైలింగ్యువల్ చిత్రాల్లో నటిస్తున్నాడు. 

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి తెలుగుతో పాటు తమిళంలో కూడా తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో బైలింగ్యువల్ చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా విజయ్ తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో బహు భాషా సినిమా చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశాడు.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందిస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి 'హీరో' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. టైటిల్ అన్ని భాషలకు కామన్ గా ఉంటుందని భావించారు.

అయితే ఇప్పుడు తమిళంలో అదే టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కింది. శివ కార్తికేయన్ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. దీనికి 'హీరో' అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. షూటింగ్ కూడా ముందుగానే మొదలైంది కాబట్టి ఈ సినిమానే ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

చిత్ర యూనిట్ కూడా తమిళ నిర్మాతల మండలిలో టైటిల్ తాము రిజిస్టర్ చేసుకున్నట్లుగా సాక్ష్యాలను బయటపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ ఏం చేస్తాడో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?