మెగాహీరో చిత్ర లహరిని మొదలెట్టేసాడు!

Published : Nov 19, 2018, 05:35 PM IST
మెగాహీరో చిత్ర లహరిని మొదలెట్టేసాడు!

సారాంశం

టాలీవుడ్ లో హిట్టుకోసం సతమతమవుతోన్న హీరోల్లో సాయి ధరమ్ టాప్ లిస్ట్ లో ఉన్నాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. డబుల్ డిజాస్టర్స్ అందుకొని కెరీర్ మొదట్లోనే కష్టపడుతున్నాడు.

టాలీవుడ్ లో హిట్టుకోసం సతమతమవుతోన్న హీరోల్లో సాయి ధరమ్ టాప్ లిస్ట్ లో ఉన్నాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. డబుల్ డిజాస్టర్స్ అందుకొని కెరీర్ మొదట్లోనే కష్టపడుతున్నాడు. ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నా కూడా ఈ హీరో అవకాశాలు అందుకోవడంలో మాత్రం కొంచెం కూడా స్లో అవ్వడం లేదు. 

నెక్స్ట్ నేను శైలజా దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న చిత్ర లహరి అనే సినిమాతో రాబోతున్నాడు. కిషోర్ కూడా నేను శైలజా తరువాత ఉన్నది ఒకటే జిందగీతో ప్లాప్ అందుకున్నాడు. దీంతో ఇద్దరు ఈ ఫ్యామిలీ అండ్ క్యూట్ ఎంట‌ర్‌టైనింగ్ స‌బ్జెక్ట్‌ కరెక్ట్ గా ప్రజెంట్ చేయడానికి తెగ కష్టపడుతున్నారు. రీసెంట్ గా లాంచ్ చేసిన ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ను నేడు హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. 

సాయి ధరమ్ తేజ్ సినిమాలో సరికొత్తగా కనిపిస్తాడని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. ఇక సాయి సరసన హలో బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ - నివేత పెతు రాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ మరోసారి కిషోర్ ప్రాజెక్ట్ కు సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు దర్శకుడు షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్నాడు. 

PREV
click me!

Recommended Stories

అందుకే పవన్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
'మన శంకర వరప్రసాద్ గారు' సెన్సార్ రివ్యూపై నిర్మాత కామెంట్స్..ఆ సినిమాల వల్లే థియేటర్ల సమస్య