సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్... వేగంగా కోలుకుంటున్నారు, కానీ మరికొన్ని రోజులు ఐసీయూలోనే!

Published : Sep 14, 2021, 10:46 AM IST
సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్... వేగంగా కోలుకుంటున్నారు, కానీ మరికొన్ని రోజులు ఐసీయూలోనే!

సారాంశం

హీరో సాయి ధరమ్ తేజ్ వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. త్వరలోనే ఆయన కోలుకొని, డిశ్చార్జ్ అవుతారని అపోలో డాక్టర్స్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో ధరమ్ తేజ్ కాలర్ బోన్ ఫ్రాక్టర్ కాగా, ఎక్స్పర్ట్ ఆయనకు శస్త్రచికిత్స చేశారు.   

సెప్టెంబర్ 10 సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయి ధరమ్ తేజ్ వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. త్వరలోనే ఆయన కోలుకొని, డిశ్చార్జ్ అవుతారని అపోలో డాక్టర్స్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో ధరమ్ తేజ్ కాలర్ బోన్ ఫ్రాక్టర్ కాగా, ఎక్స్పర్ట్ ఆయనకు శస్త్రచికిత్స చేశారు. 


సాయి ధరమ్ కోలుకుంటున్న నేపథ్యంలో అపోలో వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేయడం ఆపివేశాయి. అయితే సాయి ధరమ్ ఇంకా ఐసీయూ లోనే ఉన్నారు. 24 గంటల వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుందని సమాచారం. రెండు మూడు రోజుల్లో సాధారణ వార్డ్ కి ఆయన్ని షిఫ్ట్ చేసే అవకాశం కలదు. 


సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలియజేస్తున్నారు. ఇప్పటికే పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు సాయి ధరమ్ ని చూడడానికి అపోలో ఆసుపత్రికి స్వయంగా వచ్చారు. 


మరోవైపు సాయి ధరమ్ ప్రమాదంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన బైక్ స్కిడ్ కావడానికి రోడ్డుపై ఉన్న ఇసుక కారణం అని కొందరు అంటుంటే, అతి వేగమే ప్రమాదానికి కారణం అని మరికొందరు ఆరోపిస్తున్నారు. సాయి ధరమ్ పరిమితికి మించిన వేగంతో బైక్ డ్రైవ్ చేసినట్లు ధ్రువీకరించిన అధికారులు ఆయనపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కు సంబంధించిన సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?