లవ్ స్టోరీ ని ఏఎన్నార్ ఎపిక్ హిట్ తో పోల్చిన నాగార్జున.. కొంచెం అతి అంటున్న నెటిజెన్స్

Published : Sep 14, 2021, 09:10 AM IST
లవ్ స్టోరీ ని ఏఎన్నార్ ఎపిక్ హిట్ తో పోల్చిన నాగార్జున.. కొంచెం అతి అంటున్న నెటిజెన్స్

సారాంశం

చైతు ఫాదర్ కింగ్ నాగార్జున నిన్న లవ్ స్టోరీ గురించి ఆసక్తికర పోస్ట్ చేశారు. ఆయన తండ్రి ఏఎన్ఆర్ కెరీర్ లో ఎపిక్ హిట్ గా నిలిచిన ప్రేమనగర్ పోస్టర్ తో పాటు లవ్ స్టోరీ పోస్టర్ ని పోస్ట్ చేశారు.   

ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆయన గత చిత్రం ఫిదా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సాయి పల్లవితో ఆయన సిల్వర్ స్క్రీన్ పై చేసిన మ్యాజిక్ లవ్ స్టోరీ మూవీతో రిపీట్ అవుతుందని సినీ ప్రేమికులు భావిస్తున్నారు. నిన్న ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. 


శేఖర్ కమ్ముల మరోమారు తెలంగాణా నేపథ్యం ఎంచుకోగా, నాగ చైతన్య, సాయి పల్లవి పక్కా పల్లెటూరి మిడిల్ క్లాస్ యూత్ గా కనిపిస్తున్నారు. ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ దక్కుతుండగా, సినిమా విజయంపై ఆశాభావం మరింతగా పెరిగింది. కాగా చైతు ఫాదర్ కింగ్ నాగార్జున నిన్న లవ్ స్టోరీ గురించి ఆసక్తికర పోస్ట్ చేశారు. ఆయన తండ్రి ఏఎన్ఆర్ కెరీర్ లో ఎపిక్ హిట్ గా నిలిచిన ప్రేమనగర్ పోస్టర్ తో పాటు లవ్ స్టోరీ పోస్టర్ ని పోస్ట్ చేశారు. 


సదరు నాగ్ పోస్ట్, ప్రేమనగర్ సినిమాతో లవ్ స్టోరీ సినిమాను పోల్చుతున్న భావన కలిగింది. దీనితో నెటిజెన్స్ ప్రేమనగర్ కి లవ్ స్టోరీకి పోలికా, ఏఎన్ఆర్ ఎక్కడా, చైతూ ఎక్కడా... కొంచెం అతిగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నాగార్జున ఈ రెండు చిత్రాల విడుదల తేదీలను మాత్రమే పోల్చారు. ప్రేమనగర్ 1971 సెప్టెంబర్ 24న విడుదల కాగా, లవ్ స్టోరీ సరిగ్గా 50ఏళ్ల తరువాత 2021 సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఈ విషయాన్నే నాగ్ తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్