జహీర్ ఖాన్ పెళ్లి డేట్ ఫిక్స్

Published : Sep 14, 2017, 02:41 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
జహీర్ ఖాన్ పెళ్లి డేట్ ఫిక్స్

సారాంశం

పెళ్లి పీటలు ఎక్కనున్న జహీర్ ఖాన్ బాలీవుడ్ నటి సాగరికతో గత కొంత కాలంగా ప్రేమాయణం నవంబర్ లో పెళ్లి

టీం ఇండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బాలీవుడ్ నటి సాగరిక ఘట్గేతో ఆయన గత కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ.. వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.

 

నవంబరు 27న తేదీన వీరి పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వీళ్లిద్దరూ పెళ్లి పనుల్లో బిజీ అయ్యారట.  పెళ్లికి అత్యంత సన్నిహితులు, స్నేహితులే హాజరుకానున్నారు. వివాహం అనంతరం ముంబై, పుణెలో జహీర్‌ దంపతులు సన్నిహితులు, స్నేహితుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్‌ నిర్వహించనున్నారట. ఈ వివాహ రిసెప్షన్‌కు రాజకీయ, బాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు క్రికెటర్లు కూడా హాజరు కానున్నారని సమాచారం.

 

గతేడాది ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ వివాహానికి జహీర్, సాగరికలు కలిసి రావడంతో మీడియా దృష్టి వీరిపై పడింది. మొదట వీరి మధ్య ఉన్న బంధాన్ని అంగీకరించకపోయినా.. తర్వాత జహీర్ ట్విట్టర్ వేదికగా.. వారి ఇద్దరి ప్రేమను అభిమానులకు తెలియజేశారు. ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది. కొద్ది రోజుల క్రితం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాగరిక కూడా.. త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నానని.. తన మిగిలిన జీవితం అంతా తనతో గడుపుతున్నందకు సంతోషంగా ఉందని తెలిపింది. బాలీవుడ్ సూపర్ హిట్ గా నిలిచిన ‘చెక్ దే  ఇండియా‘ చిత్రంలో సాగరిక నటించిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు