Sada Nannu Nadipe Review: `సదా నన్ను నడిపే` మూవీ రివ్యూ..

By Aithagoni Raju  |  First Published Jun 24, 2022, 9:49 PM IST

నాగబాబు, అలీ వంటి సీనియర్‌ నటులతో, ఒక్కడే హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించి, సంగీతం అందిస్తూ రూపొందించిన చిత్రం `సదా నన్ను నడిపే`. నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 


'వాన‌విల్లు ' చిత్రం త‌ర్వాత హీరో ప్రతీక్ ప్రేమ్ క‌ర‌ణ్ న‌టించిన తాజా చిత్రం 'సదా నన్ను నడిపే '. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో వైష్ణవి పట్వర్ధన్ హీరోయిన్. నాగేంద్ర బాబు, నాజర్, రాజీవ్ కనకాల, ఆలీ ఇతర ప్ర‌ధాన తారాగ‌ణంగా తెరకెక్కిన ఈ సినిమాకి చిత్ర హీరోనే ద‌ర్శ‌క‌త్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం అందించారు. స్వచ్చమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం(జూన్‌ 24)న విడుదలైంది. పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల సపోర్ట్ పొందిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం సక్సెస్‌ అయ్యిందా? దాదాపు ఏడు సినిమాలతో పోటీ పడి ఆడియెన్స్‌ ని మెప్పించిందా? అనేది చూద్దాం. 

కథ:
మైఖేల్ జాక్సన్ అలియాస్‌  MJ  (ప్రతీక్ ప్రేమ్ కరణ్) సరదాగా స్నేహితులతో గడిపే కుర్రాడు. అతడు సాహా(వైష్ణవి పట్వర్దన్) ప్రేమలో పడతాడు. ఆమె ఎంత కాదన్నా ఎంతో సిన్సియర్ గా లవ్ చేస్తూ వుంటాడు. సాహా తండ్రి రాజీవ్ కనకాల కూడా అతని ప్రేమని అంగీకరించడు. అయితే MJ మాత్రం ఎలాగైనా సాహా ప్రేమని పొందాలని పరితపిస్తుంటాడు. ఈ క్రమంలో MJ ప్రేమని సాహా అంగీకరించి వివాహం చేసుకుంటుంది. అయితే పెళ్ళైన మొదటి రోజు నుంచే MJ ని దూరం పెడుతూ ఉంటుంది.  పెళ్లి చేసుకుని కూడా MJ ని సాహా ఎందుకు దూరం పెడుతూ ఉంటుంది? ఆమె సమస్య ఏంటి? హీరో దాన్ని ఎలా పరిష్కరించాడు? వీరిద్దరూ చివరికి ఎలా కలుసుకున్నారా? లేదా అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Latest Videos

కథనం విశ్లేషణ:
చిత్ర హీరో చెప్పినట్టు ఇంతకు మునుపు స్వచ్చమైన, నిశ్వర్థమైన ప్రేమకథలతో `గీతాంజలి`, `కలిసుందాం రా` లాంటి సినిమాలు వచ్చి బాక్సాఫీస్ ని కళకళ లాడించాయి. ఇప్పుడీ చిత్రాన్ని కుడా హీరో కమ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రేమ్ కరణ్ ఎంతో ఎమోషనల్ గా ప్యూర్ లవ్ ట్రాక్ తో ఎంతో ఎంటర్టైనింగ్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. మ‌న‌కు బాగా తెలిసిన వ్య‌క్తి చ‌నిపోతున్నారని తెలిశాక వారితో వున్న కొద్దిక్ష‌ణాలను ఎంత మధుర జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటామో అనేది ఇందులో చూపించారు. ప్రేమించిన వ్యక్తికోసం ఎలాంటి త్యాగాన్ని ఆయినా చెయ్యొచ్చు అని... ఇందులో ఎంతో ఎమోష‌నల్ గా తెరకెక్కించారు. దానికీ ప్ర‌తి ఒక్క‌రూ క‌నెక్ట్ అవుతారు. క‌ర్నాట‌క‌లో జ‌రిగిన ఓ వాస్తవ సంఘటన   అంశాన్ని తీసుకుని సినిమాటిక్‌గా మార్చిన తీరు బాగుంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా వుంది. 

అయితే అక్కడక్కడ కాస్త రొటీన్‌ సన్నివేశాలు కనిపిస్తుంటాయి. దీంతో కాస్త బోర్‌ ఫీలింగ్‌ తీసుకొస్తుంది. కానీ అందలోనే వచ్చే ట్విస్టులు, అలీ వంటి పలువురు కమేడియన్లు చేసే ఎంటర్‌టైనింగ్‌ సన్నివేశాలు ఆడియెన్స్ కి రిలీఫ్‌ నిస్తుంటాయి. గత చిత్రాలను పక్కన పెట్టిన చూస్తే కాసేపు సరదాగా చూసుకునే చిత్రమవుతుంది. మిగిలిన చిత్రాలతో పోల్చితే బెటర్‌గానే ఈ సినిమా ఉంటుందని చెప్పొచ్చు. అయితే హీరోనే దర్శకుడు కావడంతో కాస్త పర్‌ఫెక్షన్‌ మిస్‌ అయ్యింది. ఇంకాస్త కేర్‌ తీసుకుంటే బాగుండేది. ఎంటర్‌టైన్‌మెంట్‌ పాళ్లు పెంచితే మరింతగా ఆకట్టుకునే చిత్రమయ్యేది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరుః

హీరో కమ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రేమ్ చాలా బాగా చేశాడు. తను నటిస్తూనే.. దర్శకత్వ బాధ్యలను చాలా సమర్థవంతంగా నిర్వహించాడు. ఆయన కష్టం తెరపై కనిపిస్తుంది. ఆదిలోనే రెండు బాధ్యతలు కూడా కత్తిమీద సాములాంటివని సినిమా చూస్తుంటే తెలుస్తుంది. హీరోయిన్ వైష్ణవి తన పాత్రకు న్యాయం చేసింది. అలీ ఉన్నంత సేపు బాగా నవ్వులు పుయించాడు. నాగబాబు, రాజీవ్ కనకాల తమ తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. సంగీతం బాగుంది. నందు కంపోజ్ చేసిన ఫైట్స్ బాగున్నాయి.సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేసుంటే బాగుండేది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఫైనల్‌గా ఇదొక సరదా టైమ్‌ పాస్‌ మూవీ అని చెప్పొచ్చు. 


రేటింగ్‌ః 2.75

click me!