ఫ్యాన్స్ ని మళ్లీ డిజప్పాయింట్‌ చేసిన నాగచైతన్య.. `థ్యాంక్యూ` మూవీ రిలీజ్‌ ఛేంజ్‌.. ఎప్పుడంటే?

Published : Jun 24, 2022, 07:15 PM IST
ఫ్యాన్స్ ని మళ్లీ డిజప్పాయింట్‌ చేసిన నాగచైతన్య.. `థ్యాంక్యూ` మూవీ రిలీజ్‌ ఛేంజ్‌.. ఎప్పుడంటే?

సారాంశం

నాగచైతన్య తన ఫ్యాన్స్ ని మరోసారి నిరాశ పరిచారు. ఆయన హీరోగా నటిస్తున్న `థ్యాంక్యూ` సినిమా మళ్లీ వాయిదా పడింది. 

నాగచైతన్య ఓ వైపు లవ్‌ ఎఫైర్‌ వార్తలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. ఆయన తెలుగు హీరోయిన్‌ శోభితా దూళిపాళ్లతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయన నటించిన సినిమా వాయిదాలు పడుతుంది. `మనం` ఫేమ్‌ విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నాగచైతన్య `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాశీఖన్నా మెయిన్‌ హీరోయిన్‌గా నటించగా, అవిగోర్‌, మాళవిక నాయర్‌ సెకండ్‌, థర్డ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. ఫైనల్‌గా జులై 8న విడుదల చేయాలనుకున్నారు. తాజాగా సినిమా మరోరెండు వారాలు వెనక్కి వెళ్లింది. కొత్త డేట్‌ని ప్రకటించారు. జులై 22న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. దీంతో చైతూ ఫ్యాన్స్‌ కాస్త డిజప్పాయింట్‌ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, గ్లింప్స్, రెండు పాటలకు మంచి స్పందన లభించింది. టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో స్టూడెంట్‌గా, బిజినెస్‌ మ్యాన్‌గా నాగచైతన్య పలు వేరియేషన్స్ చూపిస్తున్నారు. 

ఒక్కో ఫేజ్‌లో ఆయన లవ్ ఫెయిల్యూర్‌ చూపిస్తూ చివరికి తాను ఇప్పటి వరకు చాలా వదులుకున్నా, ఇంకా వదులుకోవడానికి సిద్ధంగా లేను అని చెప్పడం ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. మొదట మాళవిక నాయర్‌, తర్వాత అవికా గోర్‌, ఆ తర్వాత రాశీఖన్నాలతో ఆయన లవ్‌ జర్నీని ఆవిష్కరించబోతున్నారు. అయితే టీజర్‌లో చైతూ చెప్పిన డైలాగులు రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉండటంతో ఆద్యంతం ఆసక్తి నెలకొంది. సినిమా ఎలా ఉండబోతుందో అనే ఇంట్రెస్ట్ పెరిగింది. 

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. `లవ్‌ స్టోరీ`, `బంగార్రాజు` వంటి చిత్రాల తర్వాత చైతూ నుంచి వస్తోన్న సినిమా కావడం అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను రీచ్‌ అవుతుందా? లేదో చూడాలి. ఈ చిత్రానికి లెజండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ గా పనిచేశారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. బీవీఎస్ రవి కథను అందించారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు
Ileana: ప్రభాస్‌, మహేష్‌, తారక్‌, రవితేజ గురించి ఇలియానా ఒక్క మాటలో