బండ్ల గణేష్ పెద్ద మోసగాడు : సచిన్ జోషి

Published : Mar 08, 2018, 12:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
బండ్ల గణేష్ పెద్ద మోసగాడు : సచిన్ జోషి

సారాంశం

సినిమాల్లో కామెడీ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీకి పరిచయమైన బండ్ల గణేష్ తరవాత కాలంలో స్టార్ ప్రొడ్యూసర్ అయ్యాడు బిజినెస్ మెన్ కమ్ హీరో అయిన సచిన్ బండ్ల గణేష్ అసలు రూపం బయటపెట్టాడు​

సినిమాల్లో కామెడీ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీకి పరిచయమైన బండ్ల గణేష్ తరవాత కాలంలో స్టార్ ప్రొడ్యూసర్ రేంజికి పెరిగాడు.పెద్ద హీరోల పేర్లు చెప్పుకుంటు ఇంతవాడైయ్యాడు. బిజినెస్ మెన్ కమ్ హీరో అయిన సచిన్ బండ్ల గణేష్ అసలు రూపం బయటపెట్టాడు. అసలు బండ్ల గణేష్ తో తనకు పరిచయడం ఎలా ఏర్పడింది.. అతడితో సినిమాలు ఎందుకు తీసిందీ సచిన్ రీసెంట్ గా బయటపెట్టాడు. ‘‘ఎస్.వి.కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన తాను హీరోగా నటించిన ఒరేయ్ పండు సినిమాలో బండ్ల గణేష్ తనకు పరిచయం అయ్యాడు. అప్పటికే నేను చాలా రిచ్ బిజినెస్ మేన్ అని తెలుసుకుని తాను చాలా కష్టాల్లో ఉన్నానని.. పైకెదగడానికి సాయం కావాలని కోరాడు. దాంతో సినిమా ప్రొడ్యూసింగ్ లో అతడిని చేర్చుకున్నాం. అతడు తీసిన సినిమాలకు ఫైనాన్స్ చేశాం. డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వచ్చేటప్పటికి తన అసలు రంగు చూపించడం మొదలుపెట్టాడు. అతడికి మనుషులను మోసం చేయడమనే వ్యాధి ఉంది. నావరకు అతడో పిల్లి. కళ్లు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడలేదు అనుకునే టైపు.’’ అంటూ బండ్ల తీరుపై ఫైరయ్యాడు సచిన్ జోషి. 

తాను సినిమాలు మానేసి ప్రొడ్యూసర్ గా ఉన్న టైంలో తిరిగి నటించమంటూ ఒత్తిడి చేసింది బండ్ల గణేషేనని సచిన్ చెప్పుకొచ్చాడు. సచిన్ హీరోగా ఆషికి-2 ను తెలుగులో రీమేక్ చేసి ‘నీజతగా నేనుండాలి’ పేరుతో రిలీజ్ చేశారు. తెలుగు ప్రేక్షకులు తనను చూడాలని తెగ కోరుకుంటున్నారని ఒకటికి పదిసార్లు చెప్పడంతోనే ఆ సినిమా చేశానని క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా కలెక్షన్ల విషయంలోనూ బండ్ల తనను మోసం చేశాడని చెప్పుకొచ్చాడు ఈ బిజినెస్ మాన్. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Gift: `ఓజీ` దర్శకుడికి పవన్‌ కళ్యాణ్‌ ఊహించని గిఫ్ట్.. సుజీత్‌ ఎమోషనల్‌
9 సినిమాలు చేస్తే.. అందులో 8 ఫ్లాప్‌లు.. పాన్ ఇండియా స్టార్‌పైనే ఆశలన్నీ.. ఎవరీ హీరోయిన్.?