తల్లీకూతుళ్ల సెంటిమెంట్‌తో వరలక్ష్మి `శబరి`.. ఉర్రూతలూగిస్తున్న మంగ్లీ కొత్త పాట..

By Aithagoni RajuFirst Published Apr 21, 2024, 12:59 AM IST
Highlights

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ మూవీలోని అసలు స్టోరీ ఏంటో బయటపెట్టాడు నిర్మాత. మరోవైపు మంగ్లీ పాడిన లచ్చిమక్క పాట దుమ్మురేపుతుంది. మరి ఆ కథేంటో చూద్దాం. 

విలక్షణ నటి వరలక్ష్మి తెలుగులో మొదటిసారి లేడీ ఓరియెంటెడ్‌ మూవీ చేస్తుంది. `శబరి` పేరుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అనిల్‌ కాట్జ్ దర్శకుడు. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్‌ పతాకంపై మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మిస్తున్నారు. మే 3న ఈ చిత్రం విడుదలవుతుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ చిత్ర విశేషాలను పంచుకున్నారు. అమెరికాలో వ్యాపారాలు చేసే అతని సినిమాపై ప్యాషన్‌తో చిత్ర పరిశ్రమలోకి వచ్చారట. మొదటగా ఏ సినిమా చేయాలనుకునే టైమ్‌లో దర్శకుడు ఈ కథతో వచ్చారట. వరలక్ష్మి దీనికి ఒప్పుకున్నారని తెలిసే వెంటనే సినిమా చేయడానికి సిద్దమయ్యాడట. 

థ్రిల్లర్‌ చిత్రాలు చాలా వచ్చాయి. కానీ మదర్‌, డాటర్‌ సెంటిమెంట్‌తో వచ్చిన చిత్రాలు చాలా అరుదు. ఇది అలాంటి కంటెంట్‌తో, మదర్‌ అండ్‌ డాటర్‌ సెంటిమెంట్‌తో రూపొందిన మూవీ. ఎమోషన్స్ డిఫరెంట్ వేలో చెప్పాం. కొన్ని సినిమాల్లో మదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ చూసి ఉంటారు. ఇందులో మేం డిఫరెంట్ గా చెప్పాం. కూతురు కోసం అమ్మ ఎంతటి పోరాటం చేస్తుందనేది `శబరి` చిత్రంలో హైలైట్‌ పాయింట్‌ అని, వరలక్ష్మి సినిమా చేస్తున్నారటంటే యాభై శాతం సక్సెస్‌ గ్యారంటీ అనే నమ్మకంతోనే ఈ మూవీ చేశానని తెలిపారు. 

కొత్త నిర్మాతని కావడంతో మొదటి సినిమాకి బడ్జెట్‌ పరంగా, ప్రొడక్షన్‌ పరంగా కొన్ని కష్టాలు ఎదురయ్యాయని, కానీ వాటిని ఓవర్‌ కమ్‌ చేశామని, ఇప్పుడు ప్రొడక్షన్‌ పై పట్టు వచ్చిందన్నారు. కష్టపడి పనిచేస్తూ, మంచి కంటెంట్‌ని ఎంపిక చేసుకుని, ప్రొడక్షన్‌ కంట్రోల్‌గా చేస్తే నిర్మాతకు నష్టం లేదన్నారు. తాను అదే ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం మరో రెండు సినిమాలను తీస్తున్నానని, అందులో వరుణ్‌ సందేశ్‌తో ఓ మూవీ, బిగ్‌ బాస్‌ అమర్‌ దీప్‌తో మరో మూవీ చేస్తున్నట్టు తెలిపారు.  

ఊపేస్తున్న మంగ్లీ కొత్త పాట `లచ్చిమక్క`..

రియల్‌ ఇన్సిడెంట్స్ ఆధారంగా వచ్చిన చిత్రాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. అలాంటి కథాంశంతో వస్తున్న మూవీ `జితేందర్‌ రెడ్డి`. రాకేష్‌ వర్రే హీరోగా, విరించి వర్మ దర్శకత్వంలో  1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు.

గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. రీసెంట్ గానే విడుదల అయిన `అ ఆ ఇ ఈ ఉ ఊ` సాంగ్ మంచి ప్రేక్షక ఆదరణ పొందింది. ముఖ్యంగా యువతకి ఆ పాట బాగా నచ్చింది.  ఆ సాంగ్ కాలేజీ బ్యాక్ డ్రాప్ కాగా ఇప్పుడు విడుదలైన ఈ ‘లచ్చిమక్క’ సాంగ్ పెళ్లి బ్యాక్ డ్రాప్ లో ఉంది.  ఈ పాటకి గోపి సుందర్ మ్యూజిక్ అందించగా రాంబాబు గోసాల లిరిక్స్ రాశారు. మంగ్లీ ఈ పాటని ఆలపించారు. జితేందర్ రెడ్డి ఇంట్లో జరిగే పెళ్ళిలో సరదాగా సాగే ఒక పాటలా ఉంది. 1980' లో లొకేషన్స్ అన్ని కూడా చాలా నాట్యురల్ గా ఉన్నాయి. ఈ పాత ద్వార కథలో ట్విస్టులు ఉన్నట్టు అర్ధమవుతుంది. ఈ మూవీ మే 3న విడుదల కానుంది. 
 

click me!