`కల్కి2898ఏడీ` సస్పెన్స్ పై స్పందించి టీమ్‌.. అప్‌ డేట్‌కి రెడీ.. కానీ అదే పెద్ద సస్పెన్స్..

Published : Apr 20, 2024, 08:52 PM IST
`కల్కి2898ఏడీ` సస్పెన్స్ పై స్పందించి టీమ్‌.. అప్‌ డేట్‌కి రెడీ.. కానీ అదే పెద్ద సస్పెన్స్..

సారాంశం

ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి2898ఏడీ` సినిమాపై టీమ్‌ స్పందించింది. అప్‌ డేట్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. కానీ ఆ ఒక్కటి మాత్రం సస్పెన్స్ తోనే కొనసాగుతుంది.   

ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి2898ఏడీ` సినిమా కోసం ఆయన అభిమానులు మాత్రమే కాదు, సాధారణ సినీ లవర్స్ సైతం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. సినిమాకి సంబంధించిన అప్‌డేట్ల కోసం వెయిట్‌ చేస్తున్నారు. కానీ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నుంచి గానీ, నిర్మాణ సంస్థ నుంచి గానీ ఎలాంటి రియాక్షన్‌ లేదు. ఆ మధ్య ప్రభాస్‌ పాత్రని వెల్లడించారు. ఆయన భైరవ పాత్రలో కనిపిస్తారని ఆ పాత్రని విడుదల చేశారు. కానీ రిలీజ్‌పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 

సినిమా వాయిదా పడుతుందనే ప్రచారం గట్టిగా సాగుతుంది. కానీ టీమ్‌ రియాక్ట్ కాలేదు. ఓ ఇంటర్వ్యూలో నిర్మాత స్వప్న దత్‌.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, బయ్యర్లు, పార్టనర్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమా రిలీజ్‌ వాయిదా అన్నట్టుగా చెప్పారు. రిలీజ్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ రెండు మూడు రోజుల్లో రిలీజ్‌ డేట్‌ క్లారిటీ వస్తుందన్నారు. కానీ టీమ్‌ రియాక్ట్ కాలేదు. తాజాగా ఎట్టకేలకు స్పందించింది యూనిట్‌. అప్‌డేట్‌కి సిద్ధమైంది. అయితే ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ పాత్రని రివీల్‌ చేయబోతున్నారు. ఆయన పోస్టర్‌ని పంచుకుని ఆయన ఎవరో తెలుసుకునే సమయం వచ్చిందని పేర్కొంది. 

రేపు సాయంత్రం 7.15గంటలకు అమితాబ్‌ బచ్చన్‌ పాత్రని రివీల్‌ చేస్తామని తెలిపింది. అయితే ఐపీఎల్‌ మ్యాచ్‌లో భాగంగా దీన్ని రివీల్‌ చేస్తామని, స్టార్‌ స్పోర్ట్స్ లో దీన్ని లైవ్‌లో చూడొచ్చని పేర్కొంది టీమ్‌. క్రికెట్‌ అభిమానుల మధ్య ఈ అప్‌డేట్‌ రాబోతుందని చెప్పొచ్చు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ అసలు విషయమే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అమితాబ్‌ బచ్చన్‌ పాత్రని పరిచయం చేస్తామని తెలిపారు, కానీ రిలీజ్‌ డేట్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. అమితాబ్‌ పాత్ర పరిచయంతోనే రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తారా? లేక దానికి మరికొన్ని రోజులు ఊరిస్తారా? అనేది ఇప్పుడు మరింత సస్పెన్స్ గా మారింది. ఏం జరుగుతుందనేది తెలియాలంటే మరో 24 గంటలు వెయిట్‌ చేయాల్సిందే. 

ఇక ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిశా పటానీకి ప్రభాస్‌కి జోడీగా నటిస్తుంది. కమల్‌ హాసన్‌, విజయ్ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ వంటి భారీ కాస్టింగ్‌ గెస్ట్ రోల్స్ లో మెరబోతున్నారట. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మే 9న ఈ మూవీని రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నారట. మే 30గానీ, జూన్‌లోగానీ సినిమాని విడుదల చేసే అవకాశం ఉంది. ఎప్పుడు రిలీజ్‌ చేసినా అత్యధిక భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా