అత్త సురేఖ అవకాయ పచ్చడి పెడుతుంటే.. ఆటపట్టిస్తూ కోడలు ఉపాసన ఫన్‌.. వీడియో వైరల్‌

Published : Apr 20, 2024, 11:35 PM IST
అత్త సురేఖ అవకాయ పచ్చడి పెడుతుంటే.. ఆటపట్టిస్తూ కోడలు ఉపాసన ఫన్‌.. వీడియో వైరల్‌

సారాంశం

చిరంజీవి తల్లి అంజనాదేవి, భార్య సురేఖలను ఆడుకుంది ఉపాసన. ఫన్నీ వీడియో తీసి పంచుకోగా, అది వైరల్‌ అవుతుంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది.   

మెగా ఫ్యామిలీ కోడళ్లు `అత్తమ్మా కిచెన్‌`ని ప్రారంభించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ భార్య ఉపాసన సారథ్యంలో ఈ కిచెన్‌ ని ప్రారంభించారు. పచ్చళ్లు, రుచికరమైన వంటకాలు చేస్తూ ఆన్‌ లైన్‌ ద్వారా విక్రయిస్తున్నారు. ఆ మధ్య దీన్ని ప్రారంభించారు. బాగా రన్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో ఉపాసన దీన్ని తనదైన స్టయిల్‌లో ప్రమోట్‌ చేస్తూ మార్కెట్‌ని పెంచుతుంది. ఈ మేరకు ఆమె వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటుంది. 

రామ్‌ చరణ్‌ నాన్నమ్మ అంజనాదేవి, అమ్మ సురేఖలతో ఉపసాన ఫన్నీ వీడియోలు చేస్తూ రచ్చ చేస్తుంది. ఆ మధ్య ఇలాంటి వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు మరో క్రేజీ వీడియోని పంచుకుంది ఉపసాన. అత్తమ్మా కిచెన్‌ సోషల్‌ మీడియాలో ఈ వీడియోని షేర్‌ చేసింది. ఇందులో అంజనాదేవి పర్యవేక్షణలో ఈ పచ్చళ్లు ప్రిపరేషన్‌ కార్యక్రమం జరుగుతుంది. సురేఖ స్వయంగా మామిడికాయ పచ్చడి ప్రిపేర్‌ చేస్తున్నారు. మామిడి ముక్కల్లో వెల్లుల్లి కాయలు, ఇతర టేస్టీ పౌడర్స్ వేస్తూ కలుపుతుంది. ఆమె ఆ ప్రిపరేషన్‌లో బిజీగా ఉంది. పని వాళ్లు ఈ ప్రిపరేషన్‌లో ఆమెకి సహయంగా ఉన్నారు. 

ఈ సందర్భంగా ఉపాసన వీడియో తీస్తూ ఫన్నీగా ఆటపట్టించే ప్రయత్నం చేసింది. అంజనా దేవి వద్దకు వెళ్లి నానమ్మ మీరు ఎందుకు ఇంత సీరియస్‌గా ఉన్నారు అని అడిగింది ఉపాసన. దీనికి ఆమె స్పందిస్తూ సీరియస్‌ ఏం లేదు, పనిలేక ఇలా కూర్చున్నా అని చెబుతుంది. మీ కోడలు పని చేయడం లేదా మంచిగా అంటే నువ్వు ఉన్నావుగా కోడలివి అని సమాధానం చెబుతుంది. ఇక ఉపాసన అక్కడ అవకాయ పచ్చడి ప్రిపరేషన్‌ చూపిస్తూ అత్తమ్మ సురేఖ వద్దకు వెళ్తుంది. 

అత్తమ్మ అని అనగా, ఏం చేస్తున్నావని మాత్రం అడక్కు అంటుంది. దీంతో హిందీలో అడగ్గా, అసలుకే రాదు అని ఆమె చెప్పడం నవ్వులు పూయిస్తుంది. ఆ తర్వాత మరో ఆంటీ వద్దకు వెళ్లి, హాయ్‌ అంటీ అని విష్‌ చేసి వెల్‌ కమ్‌టూ అత్తమాస్‌ కిచెన్‌ అని ఉపాసన చెప్పడంతో ఆమె నవ్వులు చిందించింది. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా