Saana Kastam Lyrical: శానా కష్టం వచ్చిందే మందాకినీ.. ఆచార్య ఐటెం నంబర్ అదిరింది

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 03, 2022, 05:30 PM ISTUpdated : Jan 03, 2022, 05:32 PM IST
Saana Kastam Lyrical: శానా కష్టం వచ్చిందే మందాకినీ.. ఆచార్య ఐటెం నంబర్ అదిరింది

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం కోసం చాలా రోజులుగా అభిమానులకు ఎదురుచూపులు తప్పడం లేదు. సాలిడ్ కంటెంట్ తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం కోసం చాలా రోజులుగా అభిమానులకు ఎదురుచూపులు తప్పడం లేదు. సాలిడ్ కంటెంట్ తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్స్, సాంగ్స్ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు పెంచాయి. కొరటాల సినిమాల్లో బలమైన కథ, సందేశం, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. దీనితో ఆచార్య చిత్రంలో కొరటాల చిరంజీవిని ఎలా చూపించబోతున్నారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

తాజాగా ఈ చిత్రం నుంచి మూడవ సాంగ్ విడుదలయింది. ఇది ఐటెం నంబర్. శానా కష్టం అంటూ గమ్మత్తైన లిరిక్స్ తో సాగే ఈ పాట కొద్దిసేపటి క్రితమే విడుదలయింది. లిరికల్ వీడియో చూస్తుంటే చిరు ఫ్యాన్స్ కి, మాస్ ప్రేక్షకుల ఈ సాంగ్ థియేటర్స్ లో పండగలా ఉండబోతోంది. 

ఈ పాటకు భాస్కర బట్ల సాహిత్యం అందించారు. శానా కష్టం వచ్చిందే మందాకినీ.. అంటించొద్దే అందాల అగరొత్తిని అంటూ భాస్కర భట్ల గమ్మత్తైన లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ ని మంచి డాన్స్ బీట్ లా మలిచారు సంగీత దర్శకుడు మణిశర్మ. రేవంత్, గీతా మాధురిల గాత్రం ఆకట్టుకుంటోంది. 

 

ఇక లిరికల్ వీడియోలో చిరు, రెజీనా డాన్స్ మూమెంట్స్ కూడా చూపించారు. రెజీనా కళ్ళు చెదిరేలా గ్లామర్ లుక్ లో కనిపిస్తోంది. ఇక చిరంజీవి తన సిగ్నేచర్ స్టెప్పులతో థియేటర్స్ ని మోతెక్కించేందుకు రెడీ అయ్యారు. లిరికల్ వీడియోనే ఇలా ఉంటే.. ఇక థియేటర్స్ లో ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులకు ఐ ఫీస్ట్ కానుంది. 

ఈ చిత్రంలో రాంచరణ్ కామియో రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిసిందే. రాంచరణ్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇక చిరు సరసన కాజల్ మరోసారి ఛాన్స్ దక్కించుకుంది. 

Also Read: ఆంటీతో ఎఫైర్ అంటూ ట్రోలింగ్.. నా ఇష్టం, వయసు మ్యాటర్ కాదు.. హీరో బోల్డ్ సమాధానం

PREV
click me!

Recommended Stories

వెంకటేష్ తో మల్టీస్టారర్ ప్రకటించిన చిరంజీవి, డైరెక్టర్ ఎవరో తెలుసా?
Balu Movie: పవన్‌ కళ్యాణ్‌ `బాలు`ని రిజెక్ట్ చేసిన స్టార్‌ హీరోయిన్ ఎవరో తెలుసా? మరో స్టార్‌కి ఇచ్చిన మాట కోసం