
నాని నటిస్తున్న 'దసరా' చిత్ర సందడి మొదలయింది. డెబ్యూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన 'చమ్కీల అంగీలేసి' అనే సాంగ్ అయితే యూట్యూబ్ లో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.
దసరా చిత్రానికి అవసరమైన బజ్ మొదలయింది అనే చెప్పాలి. మార్చి 30న ఈ చిత్రం థియేటర్స్ కి వస్తుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. నాని సరసన ఈ చిత్రంలో కీర్తి సురేష్ జంటగా నటిస్తోంది. కెరీర్ లో తొలిసారి నాని రస్టిక్ అండ్ ఊరమాస్ పాత్రలో నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా చమ్కీల అంగీలేసి సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడంతో నాని, కీర్తి సురేష్ ఈ పాటని క్యాష్ చేసుకుని మరింత బజ్ పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ పాటకి చిలిపిగా డ్యాన్స్ చేస్తూ ఇన్స్టా రీల్ వీడియో చేశారు. ఈ పాటలో లిరిక్స్ కి తగ్గట్లుగా చిలిపిగా నాని, కీర్తి సురేష్ గొడవ పడుతున్న దృశ్యాలు భలే ముచ్చటగా ఉన్నాయి. కీర్తి సురేష్ ఏకంగా నాని నోరు మూసేస్తూ చేయి అడ్డు పెట్టింది.
అందరు వదినలు, బావమరుదులు ఈ గొడవని పరిష్కరించండి. మీరు కూడా ఈ సాంగ్ పై ఇన్స్టా రీల్స్ చేయండి అంటూ కీర్తి సురేష్ పోస్ట్ పెట్టింది. ఈ వీడియోకి సెలెబ్రిటీలు సైతం కామెంట్స్ తో స్పందిస్తున్నారు. మీరిద్దరూ చాలా లవ్లీగా ఉన్నారు అని మాళవిక మోహనన్ కామెంట్ పెట్టింది. ఇక స్టార్ బ్యూటీ సమంత హార్ట్ ఎమోజి పోస్ట్ చేసి తన స్పందన తెలిపింది. మార్చి 14న దసరా చిత్ర ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ సమ్మర్ లో బాక్సాఫీస్ వద్ద మొదట పేలే పెద్ద బాంబ దసరానే.