బాక్స్ ఆఫీస్: తెలుగు రాష్ట్రాల్లో సాహో ఇంకా ఎంత రాబట్టాలంటే?

By Prashanth MFirst Published Sep 9, 2019, 4:24 PM IST
Highlights

టాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ సాహో మిక్సిడ్ టాక్ తో సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకుంది. అయితే మొదటి నాలుగు రోజులు హాలిడేస్ ఉండడంతో బాలీవుడ్ బయ్యర్స్ లో సంతోషాన్ని నింపిన సాహో హాలిడేస్ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కి షాకిచ్చింది.

టాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ సాహో మిక్సిడ్ టాక్ తో సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకుంది. అయితే మొదటి నాలుగు రోజులు హాలిడేస్ ఉండడంతో బాలీవుడ్ బయ్యర్స్ లో సంతోషాన్ని నింపిన సాహో హాలిడేస్ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కి షాకిచ్చింది. ప్రభాస్ నటించిన ఈ సినిమా కీలకమైన ఏరియాల్లో అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. 

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం 80కోట్ల షేర్స్ ని రాబట్టినట్లు తెలుస్తోంది. సాహో సినిమా ఆంధ్ర - నైజాంలో 120కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే ఇంకా 40కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంటేనే బయ్యర్స్ సేఫ్ జోన్ లోకి వస్తారు. కానీ ఆ లెక్కలు ఎంతవరకు రికవర్ అవుతాయనేది సందేహంగా ఉంది. 

ఇక వరల్డ్ వైడ్ గా సాహో టోటల్ గ్రాస్ కలెక్షన్స్  400కోట్లు దాటినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మరి నిర్మాతలకు సినిమా ఎంతవరకు లాభాల్ని అందించిందో గాని సౌత్ దాదాపు సినిమా థియేటర్స్ కు తగ్గిపోయాయి. కేరళ - తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బాహుబలితో రికార్డులు తిరగరాసిన ప్రభాస్ సాహోతో మాత్రం సింగిల్ డిజిట్ కె పరిమితమయ్యాడు. 

click me!