మహేష్ సినిమాలో తమన్నా.. స్పెషల్ ఏంటంటే..?

Published : Sep 09, 2019, 04:19 PM IST
మహేష్ సినిమాలో తమన్నా.. స్పెషల్ ఏంటంటే..?

సారాంశం

2020 సంక్రాంతికి వ‌స్తున్న సినిమాల్లో `సరిలేరు నీకెవ్వ‌రు` ఒక‌టి. ఈ సినిమాని ప‌క్కా వాణిజ్య హంగులతో నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందులో భాగంగా స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. దాని త‌మ‌న్నాని సంప్ర‌దించార‌ని తెలుస్తోంది.   

ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. రష్మికా మందన్నా హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, అనిల్‌ సుంకర, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్నారు.ఈ చిత్రం పూర్తి స్దాయి ఫన్ తో రూపొందుతోంది.

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ కాకుండా మరో ఎట్రాక్షన్ ఏదైనా ఉండాలని భావించిన దర్శకుడు అనీల్ రావిపూడి.. మరో నటి తమన్నాని సినిమాలో భాగం చేశాడు.

ఆమెని తీసుకున్నది ఐటెం సాంగ్ కోసమో.. స్పెషల్ సాంగ్ కోసమో కాదట. సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ లో తమన్నా కనిపించబోతుంది. మహేష్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్ లో తమన్నా చిందులు వేయనుంది. సినిమాలో మహేష్ బాబు ఇంటిలిజెన్స్ అధికారిగా కనిపించనున్నారు కాబట్టి మహేష్ తో మాస్ స్టెప్స్ వేయించలేరు. 

అందుకే డాన్స్ పార్ట్ మొత్తం తమన్నాకి ఇవ్వాలని చూస్తున్నారు. గతంలో మహేష్, తమన్నా కలిసి 'ఆగడు' సినిమాలో నటించారు. ఇప్పుడు మరోసారి ఈ జంట కలిసి వెండితెరపై కనిపించనుంది. నిజానికి ఈ పాట కోసం శ్రుతిహాసన్ ని కూడా అనుకున్నారట. కానీ ఫైనల్ గా తమన్నా వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే