ప్రభాస్ 'సాహో' పనైపోయింది

Published : May 02, 2019, 07:34 PM IST
ప్రభాస్ 'సాహో' పనైపోయింది

సారాంశం

బాహుబలి అనంతరం ప్రభాస్ నుంచి రాబోతున్న యాక్షన్ అడ్వెంచర్ సాహో షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ గత కొన్ని రోజుల క్రితం ముంబైలో మొదలయ్యింది. 

బాహుబలి అనంతరం ప్రభాస్ నుంచి రాబోతున్న యాక్షన్ అడ్వెంచర్ సాహో షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ గత కొన్ని రోజుల క్రితం ముంబైలో మొదలయ్యింది. అయితే సినిమా షూటింగ్ లో రెస్ట్ లేకుండా పాల్గొన్న ప్రభాస్ తన పాత్రకు సంబందించిన వర్క్ ని ఫినిష్ చేశాడు. 

విలన్స్ కి సంబందించిన కొన్ని సీన్స్ ని ఫినిష్ చేస్తే సాహో షూటింగ్ పూర్తవుతుంది. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి ఆగస్ట్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. అలాగే రెగ్యులర్ ప్రమోషన్స్ ని కూడా మొదలెట్టాలని యువీ క్రియేషన్స్ ప్లాన్ చేసుకుంటోంది. 

శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శంకర్ ఏ హాసన్ లాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక హిందీలో టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ సాహో సినిమాను భారీగా రిలీజ్ చేయనున్నారు.   

PREV
click me!

Recommended Stories

Karan Johar: జాన్వీలా యాక్టర్లు ఏజెన్సీలు ఎందుకు మారుస్తారు? అసలు విషయం చెప్పిన కరణ్
రాజమౌళి సినిమాలని రీమేక్ చేస్తే అన్నీ సూపర్ హిట్లే.. అది మాత్రం ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయ్యిందో తెలుసా ?