దేవరకొండ బ్రదర్ 'దొరసాని'..లేటెస్ట్ అప్డేట్!

Published : May 02, 2019, 05:27 PM IST
దేవరకొండ బ్రదర్ 'దొరసాని'..లేటెస్ట్ అప్డేట్!

సారాంశం

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా ఎండ్ అయ్యింది.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా ఎండ్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ గా సినిమాలో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక నటించింది. 

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ లవ్ స్టోరీగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. పెళ్లి చూపులు నిర్మాత యష్ రాగినేని - మధుర శ్రీధర్ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండగా కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు సినిమా టైటిల్ పోస్టర్ ని మాత్రమే రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ నెక్స్ట్ టీజర్ తో ప్రేక్షకుల ముందుకు చూస్తోంది. 

ఓ వైపు విజయ్ దేవరకొండ బ్రదర్ - మరోవైపు జీవితా - రాజశేఖర్ ల కూతురు ప్రధాన పాత్రల్లో కనిపిస్తుండడంతో సినిమాపై స్పెషల్ ఎట్రాక్షన్ ఏర్పడింది. షూటింగ్ పూర్తవ్వడంతో  రెగ్యులర్ ప్రమోషన్స్ ని వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Kangana Ranaut Sarees: పార్లమెంట్ ఫ్యాషన్ అదుర్స్.. కంగనా బెస్ట్ శారీ లుక్స్ చూశారా?
Objection My Lord Review: అబ్జెక్షన్‌ మై లార్డ్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. శ్రీకాంత్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా ఎలా ఉందంటే?