'సువర్ణసుందరి' నుండి కొత్త పాట!

By Udayavani DhuliFirst Published 26, Sep 2018, 1:48 PM IST
Highlights

 తెలుగు సినిమా ఒరవడి మారింది. వైవిధ్యమైన సినిమాలకు ఆదరణ పెరిగింది.మన దర్శకులు సైతం సరికొత్త విధానాలతో సినిమాలను రూపొందిస్తున్నారు.

తెలుగు సినిమా ఒరవడి మారింది. వైవిధ్యమైన సినిమాలకు ఆదరణ పెరిగింది.మన దర్శకులు సైతం సరికొత్త విధానాలతో సినిమాలను రూపొందిస్తున్నారు. అదే కోవలో నాలుగు జన్మలను మిళితం చేస్తూ రొలర్ కొస్టర్ స్ర్కీన్ ప్లే తోసూపర్ నేచురల్ థ్రిల్లర్ గా "సువర్ణ సుందరి'' తెరకెక్కుతోంది.

సాయికార్తీక్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నుంచి 'సాహో సార్వ భౌమి' అనే పాటను ఈ నెల 28న విడుదల చేస్తున్నారు. జయప్రద,  పూర్ణ,  సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఓ హిస్టారికల్ అడ్వెంచర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు.

చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో  వచ్చిన సువర్ణ సుందరి టీజర్ విడుదలై సోషల్  మీడియాలో వైరల్ గా మారింది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని  విధంగా ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న  ఈ చిత్రం అతి  త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Last Updated 26, Sep 2018, 1:48 PM IST