ఆరోజే ప్రభాస్ పెళ్లి ప్రకటన!

Published : Sep 26, 2018, 01:09 PM IST
ఆరోజే ప్రభాస్ పెళ్లి ప్రకటన!

సారాంశం

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' చిత్రంతో నేషనల్ హీరో అయిపోయాడు. ప్రేక్షకుల్లో ఆయన ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్నా.. ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. టాలీవుడ్ లో ఆయన పెళ్లి టాపిక్ హాట్ హాట్ గా నడుస్తుంది.

స్టార్ హీరోయిన్ అనుష్కని పెళ్లి చేసుకుంటారని కొంతకాలం వార్తలు హల్చల్ చేశాయి. ఆ తరువాత భీమవరంకి చెందిన అమ్మాయితో ఈ ఏడాది ప్రభాస్ కి పెళ్లి అంటూ మరికొన్ని వార్తలు వినిపించాయి. కానీ వాటిల్లో నిజం లేదని తేల్చేశారు ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు. తాజాగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి మరొక వార్త జోరుగా వినిపిస్తోంది.

అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు. అదే రోజున ప్రభాస్ పెళ్లికి సంబంధించిన కీలక ప్రకటన చేయబోతున్నారని సమాచారం. ఈ విషయంలో కుటుంబ సభ్యులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రభాస్ కూడా వారి మాటకి గౌరవం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్.. సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యాడు. మరి ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత పెళ్లి చేసుకుంటాడా..? లేక మధ్యలోనే చేసుకుంటాడా..? అనే విషయం తెలియాల్సివుంది!
 
PREV
click me!

Recommended Stories

Chiranjeevi లో రామ్ చరణ్ ఇన్‌స్పిరేషన్ గా తీసుకున్న విషయం ఏంటో తెలుసా? మెగాపవర్ స్టార్ ఎమోషనల్ కామెంట్స్..
Thimmarajupalli TV Review: తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?