స్నేహితుడిపైనే ఫిర్యాదు చేసిన హీరో!

Published : Sep 26, 2018, 12:55 PM IST
స్నేహితుడిపైనే ఫిర్యాదు చేసిన హీరో!

సారాంశం

దక్షిణాది నటుడు దేవరాజ్, అతడి తనయుడు ప్రజ్వల్, హీరో దర్శన్ లు ప్రయాణిస్తోన్న కారుకి యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ యాక్సిడెంట్ లో దర్శన్ చేతికి తీవ్రమైన గాయమయింది. దీంతో అతడి చేతికి 28 కుట్లు వేసి ఓ ప్లేట్ ని కూడా అమర్చినట్లు తెలుస్తోంది

దక్షిణాది నటుడు దేవరాజ్, అతడి తనయుడు ప్రజ్వల్, హీరో దర్శన్ లు ప్రయాణిస్తోన్న కారుకి యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ యాక్సిడెంట్ లో దర్శన్ చేతికి తీవ్రమైన గాయమయింది.

దీంతో అతడి చేతికి 28 కుట్లు వేసి ఓ ప్లేట్ ని కూడా అమర్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సోమవారం ఉదయం నుండి రాత్రి దాకా పెద్ద డ్రామా జరిగింది. ప్రమాదానికి గురైన కారుని రాత్రికి రాత్రే పోలీసులకు తెలియకుండా మాయం చేశారు.

ఆ తరువాత పోలీసులు హెచ్చరించడంతో వాపసు తెచ్చారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఎవరూ బండి డ్రైవ్ చేస్తున్నారనే విషయంలో పోలీసులకు క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు కోలుకున్న దర్శన్ ఈ యాక్సిడెంట్ కి సంబంధించి తన స్నేహితుడు రాయ్ ఆంథోనీపైనే ఫిర్యాదు చేశారు.

అతడు వేగంగా కారుని నడపడంతో యాక్సిడెంట్ జరిగిందని తేలింది. హాస్పిటల్ లో విశ్రాంతి తీసుకుంటున్న దర్శన్ ని పరామర్శించడానికి పెద్ద ఎత్తున సినిమా రంగానికి చెందిన వారు తరలివస్తున్నారు. 

సంబంధిత వార్త..

సీనియర్ నటుడి కారు యాక్సిడెంట్!

PREV
click me!

Recommended Stories

Kajal Aggarwal: బాత్‌ రూమ్‌ని కూడా వదలని కాజల్‌.. బ్లాక్‌ డ్రెస్‌లో ఇలా చూస్తే ఇక అంతే
kalyan padala love story: నా కంటే వాడు బెటర్‌గా ఉన్నాడని వెళ్లిపోయింది.. కళ్యాణ్‌ క్రేజీ లవ్‌ స్టోరీ, ఎంత మోసం చేసింది