మెగా హీరోతో సాహో డైరెక్టర్ మూవీ?

By Sambi ReddyFirst Published Jun 21, 2022, 5:30 PM IST
Highlights

ఎట్టకేలకు సాహో దర్శకుడుకి ఆఫర్ దక్కినట్లు తెలుస్తుంది. ఆయనకు మెగా హీరో అవకాశం ఇచ్చారట.

ఒక్క మూవీ దర్శకుడు సుజీత్ కెరీర్ ని పాతాళంలోకి నెట్టింది. రెండో చిత్రంతోనే భారీ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కించే బాధ్యత తీసుకున్న సుజీత్ పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు. సాహో మూవీ తెలుగుతో పాటు సౌత్ ఇండియా ప్రేక్షకులకు నచ్చలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న మూవీ కావడంతో సాహోపై భారీ హైప్ ఏర్పడింది. ఒక విధంగా చెప్పాలంటే బాహుబలికి మించిన హైప్ సాహోపై ఏర్పడింది. సాహో ట్రైలర్,టీజర్స్ కూడా సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమయ్యాయి. 

తీరా సాహో విడుదలయ్యాక ప్రేక్షకులు పెదవి విరిచారు. హాలీవుడ్ తరహా స్క్రీన్ ప్లే, టేకింగ్ తో తెరకెక్కిన మూవీ మన ప్రేక్షకులు ఎక్కలేదు. దీంతో సాహో ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే హిందీలో ఈ చిత్రం వసూళ్లు దుమ్ముదులిపింది. బాలీవుడ్ లో సాహో ఏకంగా రూ. 150 కోట్ల వసూళ్లు రాబట్టింది. మొత్తంగా సాహో రూ. 430 కోట్ల వరల్డ్ వైడ్ వసూళ్లు అందుకుంది. భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన నేపథ్యంలో అనేక చోట్ల సాహో నష్టాలు మిగిల్చింది. 

ఈ సినిమా విషయంలో సుజీత్ విమర్శల పాలయ్యారు. సాహో విడుదలై మూడేళ్లు అవుతున్నా ఆయనకు మరో ఛాన్స్ దక్కలేదు. లూసిఫర్ రీమేక్ సుజీత్ తెరకెక్కించాల్సింది. స్క్రిప్ట్ పనులు సుజీత్ కి అప్పగించిన చిరంజీవి ఫైనల్ గా డైరెక్షన్ బాధ్యతలు మోహన్ రాజా చేతిలో పెట్టారు. అలా లూసిఫర్ రీమేక్ చేజారింది. అయితే మరో మెగా హీరో ఆయనకు ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 
వరుణ్ తేజ్ సుజీత్ తో మూవీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారట. సుజీత్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో పచ్చ జెండా ఊపాడట. సుజీత్-వరుణ్ తేజ్ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కడం ఖాయమే అంటూ టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇదే కనుక నిజం అయితే సుజీత్ తన టాలెంట్ నిరూపించుకునే ఛాన్స్ దక్కించుకున్నట్లే. 

ఎఫ్ 3 మూవీతో హిట్ కొట్టిన వరుణ్... నెక్స్ట్ దర్శకు ప్రవీణ్ సత్తారుతో మూవీ ఓకే చేశారు. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుండగా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. సుజీత్ ప్రాజెక్ట్ ఓకె అయితే వరుణ్ రెండు చిత్రాలు లేదు, ప్రవీణ్ చిత్రం తర్వాత సుజీత్ మూవీ సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం కలదు. ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం నాగార్జున తో ది ఘోస్ట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
 

click me!