ప్రభాస్ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని సీక్రేట్ గా... ముంబయ్ చేరిన దీపికా పదుకొనే

Published : Jun 21, 2022, 05:22 PM IST
ప్రభాస్ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని సీక్రేట్ గా... ముంబయ్ చేరిన దీపికా పదుకొనే

సారాంశం

వచ్చిన పని అయిపోయింది, ఇక బాలీవుడ్ ప్లైట్ ఎక్కేసింది.. సీనియర్ స్టార్ బ్యూటీ దీపికా పదుకునే. హైదరాబాద్ కి వచ్చాక అనారోగ్యానికి గురయిన హీరోయిన్..ముంబయ్ చేరింది. 


బాలీవుడ్ స్టార్  హీరోయిన్ దీపికా పదుకొనే హైదరాబాద్ లో షూటింగ్ ముగించుకుని సోమవారం ముంబై వెళ్లిపోయింది. ప్రాజక్ట్ కె సినిమా షూటింగ్ లో భాగంగా ఆమె చాలా రోజులుగా హైదరాబాద్ లో ఉండిపోయింది. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది దీపికా.. అమితాబ్ లాంటి  స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటిస్తున్నారు. 

అయితే రీసెంట్ గా రీసెంట్ గా కేన్స్ ఫెస్టివల్ లో సందడి చేసిన దీపిక ఆతరువాత వెంటనే  కె  ప్రాజెక్టు షూటింగ్ తో బిజీగా ఉండిపోయింది. అయితే  కేన్స్ ఫెస్టివల్ కోసం వెళ్లినప్పుడే ఆమె కరోనా బారినపడినట్టు తెలిసింది.అయితే కరోనా నుంచి కోలుకున్న తరువాత హైదరాబాద్ వచ్చిన ఆమెపై...కరోనా ప్రభాతం తగ్గలేదని తెలుస్తోంది. కరోనా తరువాత వచ్చే సమస్యలతో ఆమె బాధపడినట్టు తెలుస్తోంది. 

హైదరాబాద్ లో షూటింగ్ సందర్భంగా కరోనా అనంతరం సమస్యల కారణంగా అనారోగ్యానికి గురికావడంతో దీపికా పదుకొనే.. గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయ్యింది. ఆ తరువాత తన రెగ్యూలర్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న బ్యూటీ...తన షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని..ఎట్టకేలకు ఆమె ముంబై చేరుకుంది.

హైదరాబాద్ లో మీడియాకు చిక్కని చిన్నది.. ముంబయ్ లో కెమెరాలకు దొరికింది.  ఆరెంజ్ కలర్ షర్ట్, ఆరెంజ్ ప్యాంట్, కళ్లకు పెద్ద సైజు నల్లద్దాలతో ముంబై విమానాశ్రయం బయట దర్శనం ఇచ్చింది. ఆ సమయంలో ఆమె మాస్క్ ధరించి లేదు. తన కోసం వచ్చిన కారు ఎక్కేసి ఇంటికి వెళ్లిపోయింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో