హాస్పిటల్ లో జాయిన్ అయిన 'సాహో' డైరెక్టర్ సుజీత్!

Published : Sep 08, 2019, 12:41 PM ISTUpdated : Sep 08, 2019, 03:02 PM IST
హాస్పిటల్ లో జాయిన్ అయిన 'సాహో' డైరెక్టర్ సుజీత్!

సారాంశం

కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సుజీత్ కి డెంగూ ఎటాక్ అయిందని గుర్తించడంతో వెంటనే ఆయనను హాస్పిటల్ లో జాయిన్ చేశారు.   

యంగ్ డైరెక్టర్ సుజీత్ శనివారం నాడు హైదరాబాద్ లో ఓ హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సుజీత్ కి డెంగూ ఎటాక్ అయిందని గుర్తించడంతో వెంటనే ఆయనను హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

డెంగూ అని తెలిసిన తరువాత కూడా మొదటి రెండు రోజులు ఇంట్లోనే తన తల్లి సంరక్షణలో మెడిసిన్ తీసుకున్నారట. కానీ శుక్రవారం రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు తెలుస్తోంది.

'సాహో' సినిమాకి వచ్చిన విమర్శలు కూడా ఆయన భరించలేకపోయారని.. సైకలాజికల్ కూడా బాగా డిస్టర్బ్ అయ్యారని సమాచారం. 'సాహో' సినిమా విషయంలో సుజీత్ ని పెర్సనల్ గా ఎటాక్ చేయడం, కామెంట్స్ చేయడం వంటి విషయాలు తనను మరింత ఒత్తిడికి గురి చేశాయని సుజీత్ సన్నిహితులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు, కానీ సేఫ్.. సల్మాన్ ఖాన్ సన్నిహితులకు బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్
Rajinikanth Fitness: సూపర్ స్టార్ రజినీకాంత్ డైలీ హ్యాబిట్స్ బయటపెట్టిన జైలర్ 2 నటి.. లిస్ట్ మొత్తం ఇదే